ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల భద్రత పై మరింత దృష్టి

ABN, First Publish Date - 2021-06-22T07:14:24+05:30

మహిళల భద్రతపై మరింత దృష్టి సారించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ పేర్కొన్నారు. సోమవారం నగర శివారులోని అనుమానిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గతంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన ప్రదేశాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్రవాహనం పై పోలీసు కార్యాలయం నుంచి బయలుదేరిన ఎస్పీ ఆశ్రమం రోడ్డు, కొత్తమామిడి పాలెం, కొప్పోలు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, దశరాజుపల్లి , సర్వేరెడ్డిపాలెం రోడ్డు తదితర ప్రాంతాలను సందర్శించారు.

ఒంగోలు నగర శివారు ప్రాంతాల్లో బైక్‌పై పర్యటిస్తున్న ఎస్పీ సిద్ధార్థకౌశల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నగర శివారు ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ 

ఒంగోలు(క్రైం), జూన్‌ 21:మహిళల భద్రతపై మరింత దృష్టి సారించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ పేర్కొన్నారు. సోమవారం నగర శివారులోని అనుమానిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గతంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన ప్రదేశాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్రవాహనం పై పోలీసు కార్యాలయం నుంచి బయలుదేరిన ఎస్పీ ఆశ్రమం రోడ్డు, కొత్తమామిడి పాలెం, కొప్పోలు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, దశరాజుపల్లి , సర్వేరెడ్డిపాలెం రోడ్డు తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతర ఓప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని శివారు ప్రాంతాలపై దృష్టి సారించాలని అందులో సూచించారు. గతంలో ప్రేమ జంటలు, మహిళలపై దాడులు చేసిన పాత నేర స్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అన్నారు. వారి  కదలికలపై ఎప్పటికి అప్పడు నిఘా ఉంచాలని కోరారు. అదే విధంగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన దిశా యాప్‌ను  అందరు డౌన్‌ లోడ్‌ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఒంగోలు డీఎస్పీ  ప్రసాద్‌,ఎస్బీ డీఎస్పీ బి.మరియదాస్‌, తాలుకా ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది ఉన్నారు. 



Updated Date - 2021-06-22T07:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising