90 బస్తాల గుట్కా, 80 మద్యం బాటిళ్ల పట్టివేత
ABN, First Publish Date - 2021-10-15T04:47:04+05:30
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తుండడంతోపాటు గుట్కా వ్యాపా రం చేస్తున్న ఓ వ్యక్తి నుంచి 80 మద్యం క్వార్టర్ బాటిళ్లు, 90 బస్తాల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్, ఎస్‌ఐ వేముల సుధాకర్ తెలిపారు.
నిందితుల అరెస్టు
ఓ గ్రామ స్థాయి నాయకుడి ఆధ్వర్యంలో
మూడు నెలలగా నడుస్తున్న దందా
వివరాలు తెలిపిన సీఐ, ఎస్‌ఐ
పుల్లలచెరువు, అక్టోబరు 14 : తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తుండడంతోపాటు గుట్కా వ్యాపా రం చేస్తున్న ఓ వ్యక్తి నుంచి 80 మద్యం క్వార్టర్ బాటిళ్లు, 90 బస్తాల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్, ఎస్‌ఐ వేముల సుధాకర్ తెలిపారు. తెలంగాణ మద్యం, గు ట్కా నిల్వలు పుల్లలచెరువు మండలం గంగవరంలో ఉన్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.8వేల విలువచేసే 80 విస్కీ బాటిళ్లు, గుట్కా ఏఆర్‌పీ రేటు రూ.1,36,500 కాగా బహిరంగ మార్కెట్‌లో వాటివిలువ రూ.3.40 లక్షలు(91 బస్తాలు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రూ.40వేల విలువైన ఖలేజా 100 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంగవరం గ్రామానికి చెందిన నిందితుడు మేదరమెట్ల నారాయణ నుంచి పశువుల కొట్టంలో దాచి ఉంచిన గుట్కా, మద్యం బాటిళ్లను సోదాలు చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో అప్పగిస్తామని సీఐ తెలిపారు. గత జూన్ 28న మానేపల్లిలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 1000 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోని అరెస్టు చేశారు. పోలీసులు అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్న అక్రమార్కులు నాగార్జున సాగర్, సున్నిపెంట సరిహద్దు వద్ద పోలీసులకు మామూళ్లు ఆశ చూపి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి వ్యాపారం సాగిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.
ఆదాయ వనరుగా అక్రమ వ్యాపారం
గంగవరం గ్రామం కేంద్రంగా దొరికిన గుట్కా, తెలంగాణ మద్యం దందా మూడు నెలలుగా అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. పుల్లలచెరువు మండలానికి చెందిన ఓ గ్రామ స్థాయి నాయకుడు పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారం సాగిస్తున్నాడు. మూడు నెలలుగా పుల్లలచెరువు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం మండలంతో పాటు గుంటూరు జిల్లా బోల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచే గుట్కాను రాత్రికి రాత్రి తరలిస్తున్నారు. అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా వేకువజామున ప్రత్యేక వాహనాల్లో నేరుగా బడ్డీ కొట్లకు చేరవేసి నెలకు రెండు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.
Updated Date - 2021-10-15T04:47:04+05:30 IST