ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ABN, First Publish Date - 2021-11-28T06:59:12+05:30

ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన తూమాటి మాధవరావు తెలిపారు.

మాలకొండ వద్ద కార్యకర్తలతో మాట్లాడుతున్న మాధవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, నవంబరు 27: ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన తూమాటి మాధవరావు తెలిపారు. శనివారం ఆయన కందుకూరులోని తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసినందుకే తనకు ముఖమంత్రి అవకాశం కల్పించాడన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజ సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేయడం జరుగుతున్నారు. కందుకూ రు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు. ఎమ్మెల్సీ బీఫాం తీసుకున్న తర్వాత నామినేషన్‌ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మొదటి ఫోన్‌ ఆయనకే చేశానని మాధవరావు తెలిపారు. పార్టీ నిర్ధేశించిన మేరకు పని చేస్తానన్నారు.  సమావేశంలో కొల్లూరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 

మాలకొండ (వలేటివారిపాలెం) : జిల్లాలోని స్థానిక సంస్థల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ తూమాటి మాదవరావు తెలిపారు. మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని శనివారం ఆయన తన అనుచరులతో  కలిసి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మాదవరావు విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొల్లూరి కొండయ్య, దామా ప్రవీణ్‌ , కొళ్లగుంట వేణు, వెంకటస్వామి, కామినేని నరసింహం పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T06:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising