ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తా

ABN, First Publish Date - 2021-10-19T06:16:43+05:30

ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించేందుకే బూచేపల్లి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిందని జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా దర్శికి వచ్చిన సందర్భంగా సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వైసీపీ నాయకులు, అభిమానులు సోమవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ ప్రజలతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డిలను గజమాలతో సన్మానిస్తున్న నాయకులు, అభిమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ

దర్శి, అక్టోబరు 18 : ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించేందుకే బూచేపల్లి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిందని జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా దర్శికి వచ్చిన సందర్భంగా సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వైసీపీ నాయకులు, అభిమానులు సోమవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ ప్రజలతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తమను జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండల ప్రజలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని మంచినీటి పఽథకాల అభివృద్ధికి రూ.5కోట్ల నిధులు విడుదల చేస్తామని హమీ ఇచ్చారు. క్రీడాప్రాంగణ నిర్మాణానికి కోటి రూపాయలు విడుదల చేస్తామన్నారు. దర్శిలో పంచాయతీరాజ్‌ అతిథిగృహ  నిర్మాణం, మహిళా సంక్షేమ భవన నిర్మాణానికీ నిధులు విడుదల చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి, దొనకొండ, ముండ్లమూరు, కురిచేడు మండలాల వైసీపీ కన్వీనర్లు వీ వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, ఎస్‌. అంజయ్య, పి. వెంకయ్య, కురిచేడు జడ్పీటీసీ ఎన్‌. నాగిరెడ్డి, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, వీరగంధం కోటయ్య, పి. మధుసూదన్‌రెడ్డి, వి. మోషే, తదితరులు పాల్గొన్నారు.

భారీ ర్యాలీ 

జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి దర్శి వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత మూసినది వద్దగల ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి రాజంపల్లి చేరుకున్నారు. అక్కడ వైఎ్‌సఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  దర్శిలోని దద్దాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. వందలాదిమంది కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. 

Updated Date - 2021-10-19T06:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising