ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైట్‌ బర్లీ రైతులకు ఊరట

ABN, First Publish Date - 2021-06-18T06:39:42+05:30

కరోనా మహమ్మారితో కుదేలైన వైట్‌బర్లీ పొగాకు రైతులకు స్వల్ప ఊరట లభించింది. ఎగుమతులు లేక పండిన పంటను ఇళ్లలోనే నిల్వచేసుకున్న రైతులకు కొనుగోళ్లు ప్రారంభమవడంతోపాటు ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు.

పర్చూరులో అమ్మకానికి సిద్ధం చేస్తున్న వైట్‌ బర్లీ పొగాకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊపందుకున్న కొనుగోళ్లు

ఆశాజనకంగా ధరలు


పర్చూరు, జూన్‌ 17 : కరోనా మహమ్మారితో కుదేలైన వైట్‌బర్లీ పొగాకు రైతులకు స్వల్ప ఊరట లభించింది. ఎగుమతులు లేక పండిన పంటను ఇళ్లలోనే నిల్వచేసుకున్న రైతులకు కొనుగోళ్లు ప్రారంభమవడంతోపాటు ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. ప్రారంభంలో లోగ్రేడ్‌ పొగాకుకు కొంత మేర నాణ్యమైన ధ ర పలికింది. క్వింటా రూ.4500 నుంచి రూ.5000వేల వరకు అమ్మ కాలు సాగాయి. దీంతో నాణ్యమైన పొగాకుకు మంచి ధర ఉంటుంద న్న ఆశతో రైతులు ఉన్నారు. కరోనా రెండోదశ దెబ్బకు తోడు ఖరీఫ్‌ సీ జన్‌ మొదలు కావటం పండిన పంటలు అమ్మకాలు జరగక  రైతన్న ల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో వ్యాపారులు కొనుగోలు ప్రారంభించారు. నాణ్యమైన పొగాకు క్వింటా రూ.8000 వరకు పలుకుతోంది. దీంతో వైట్‌బర్లీ రైతులకు కొంత ఊరట చేకూరింది. పర్చూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిఽధిలోని పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, యద్దనపూడి మండలాల పరిధిలో 15వేల హెక్టార్లలో వైట్‌ బర్లీ పొగా కు సాగు చేశారు. 


Updated Date - 2021-06-18T06:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising