ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనాశి రిజర్వాయర్‌ పూర్తి చేసేదేప్పుడు ?

ABN, First Publish Date - 2021-10-15T05:26:48+05:30

జలయజ్ఞంలో శంకుస్థాపన చేసిన భవనాశి రిజర్వాయర్‌ పనులు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయని, ప్రభుత్వం స్పందించి వెంటనే పనులను పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రైతు సంఘం నేతలు


అద్దంకిటౌన్‌ అక్టోబరు 14: జలయజ్ఞంలో శంకుస్థాపన చేసిన భవనాశి రిజర్వాయర్‌ పనులు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయని, ప్రభుత్వం స్పందించి వెంటనే పనులను పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. గురువారం  భవనాశి జలాశయాన్ని మండలంలోని రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు, పలు గ్రామాలకు భూగర్భజలాల అభివృద్ధి, అద్దంకి పట్టణానికి తాగునీరు సదుపాయం అందించవచ్చనే ఉద్దేశంతో తలపెట్టిన భవనాశి జలాశయం పనులు ప్రారంభమై పుష్కరకాలం దాటినా  పూర్తి కాలేదన్నారు. ఆటంకాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమారెడ్డి, గొల్లపూడి వెంకటేశ్వర్లు, చెన్నుపాటి సుబ్బారావు, ప్రసాద్‌, సత్యనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-15T05:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising