ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2021-12-01T06:47:22+05:30

ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పొగాకు పంట నష్టపోయిన రై తులను అన్ని విధాలా ఆదుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు అన్నా రు.

మాట్లాడుతున్న రాఘునాథబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదిలి, నవంబరు 30 : ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పొగాకు పంట  నష్టపోయిన రై తులను అన్ని విధాలా ఆదుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు అన్నా రు. మంగళవారం పొదిలి పరిసర ప్రాంతాలలో సాగు చేసిన పొగాకు పంటను ఆయన పరిశీలిం చారు.  అనంతరం స్థానిక పొగాకు వేలం కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ టంగుటూరు, కందుకూరు, కనిగిరి ఏరియా లలో పంటలను పరిశీలించినట్లు చెప్పారు.  ఈ ప్రాంతాలలో ముందు గా పొగాకు నాటడం వల్ల వర్షాలకు పంట దెబ్బతిన్నదన్నారు.  ఒంగోలు ప్రాంతంలో డిసెంబరులో పొగ నారు వేస్తారన్నారు.  కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మొక్క ఎదుగుదల ఆగి పోతోందన్నారు. పొదిలి పొగాకు వేలం పరిధిలో 3,398 హెక్టార్లలో సాగు చేశారని వర్షాల కారణంగా 330 హెక్టార్లలో పంట దెబ్బతిన్న దన్నారు. కనిగిరి ప్రాంతం లో 1948 హెక్టార్లలో  సాగు చేయగా, 240 హెక్టార్లలో నష్టం వాటిల్లిం దన్నారు. పొగాకు రైతులను ఆదుకొనే విధంగా డిసెంబర్‌ 3న గుంటూరులో జరిగే బోర్డు సమావేశంలో తగిన నిర్ణ యాలు తీసుకుంటామన్నారు. కరోనా సమయంలో ప్రధాని పాలనాదక్షత స్పష్టమైందన్నారు. 121 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావడంతో ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయ న్నారు. రామాయపట్నం పోర్టు నిర్మా ణానికి కేంద్రం సహకారం అందిస్తోం దన్నారు. జిల్లాలో ఉన్న సహజ వన రులను సద్వినియోగం చేసుకుంటే ప్రగతి సాధించడం ద్వారా నిరు ద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు  పెరుగుతాయని రఘునాథ బాబు అన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన  బీజేపీ నాయకు లు రావూరి సత్యాలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామ ర్శిం చారు. పార్టీ తరుపున అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.  కార్యక్రమంలో  వేలం నిర్వాహణాధికారి గిరిరాజుకుమార్‌, బీజేపీ రాష్ట్ర నాయకులు మాగులూరి రామయ్య, మండల అధ్యక్షుడు మాకి నేని అమరసింహం, కొత్తూరి సుబ్బారావు, మువ్వలపార్ధు, చంద్రశేఖర్‌, కోటిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T06:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising