ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌ఏలందరూ సంఘటితంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-08-02T06:23:13+05:30

వీఆర్‌ఏలందరూ సంఘటితంగా ఉండాలని సమస్యలను పరిష్కరించు కోవాలని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి షేక్‌.మస్తాన్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మస్తాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి మస్తాన్‌

పామూరు, ఆగస్టు 1: వీఆర్‌ఏలందరూ సంఘటితంగా ఉండాలని సమస్యలను పరిష్కరించు కోవాలని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి షేక్‌.మస్తాన్‌ అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో సీఐటీయూ ఆద్వర్యంలో వీఆర్‌ఏల సంఘం నూతన కమిటీ సమావేశం ఆధోని నరసయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. కనీస వేతన చట్టం కింద రూ.21వేలు వేతనం ఇవ్వాలని, కారుణ్య నియామకాల కింద నామిని వీఆర్‌ఏకు పోస్టింగ్‌ ఇవ్వాలని, అర్హత కలిగిన వీఆర్‌ఏలకు ప్రమోషన్లు కల్పించాలని తీర్మానించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకొన్నారు. మండల వీఆర్‌ఏల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా రొట్టా ఇమ్మానియేలు, పైడాల శ్రీనివాసులరెడ్డి, సహాయ కార్యదర్శులకు జొన్నలగడ్డ ప్రసాద్‌, మెడబలిమి రమేష్‌, కోశాధికారిగా షేక్‌ ఖాజామస్తాన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సమావేశంలో సీఐటీయూ మండల కమిటీ అధ్యక్షుడు షేక్‌ అల్లాభక్షుతో పాటు వీఆర్‌ఏలు కొండమ్మ, షేక్‌ ఖాజాభి, చినకొండయ్య, అంకయ్య, మాలకొండయ్య, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T06:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising