ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల వలయంలో గ్రామాలు

ABN, First Publish Date - 2021-03-08T05:50:00+05:30

మండలంలోని కేతగుడిపి అదే పంచాయతీలోని బుడ్డపల్లెలో స మస్యలకు నిలయంగా మారింది.

బుడ్డపల్లెలోని అంతర్గత రోడ్డు దుస్థితి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కేతగుడిపి, బుడ్డపల్లెలో 

వసతులు కరువు

అంతర్గత రోడ్లు అధ్వానం

వీధుల్లో మురుగు నీరు 

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

తర్లుపాడు, మార్చి 7: మండలంలోని కేతగుడిపి అదే పంచాయతీలోని బుడ్డపల్లెలో స మస్యలకు నిలయంగా మారింది. ఏ వీధిలో చూసినా అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉ న్నాయి. మురుగు కాలువలు లేక పోవడం తో నీరంతా రోడ్లపై ప్రవహిస్తుండటంతో కం పుకొడుతోంది. బుడ్డపల్లెలో మంచినీటి స మస్య కూడా తీవ్రంగా ఉంది. ట్యాంకర్ల ద్వా రా సరఫరా చేసే ఫ్లోరిన్‌ నీరే తాగాల్సిన పరి స్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. బుడ్డపల్లె పాఠశాల చుట్టూ పలకల గనుల క్వారీలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలోని ప్రజలంతా నిత్యం క్వారీలలో పనిచేసి బతుకు బండి ఈడ్చుతు న్నారు. కేతగుడిపి, బుడ్డపల్లెకు వెళ్లే రహదా రి మోకాళ్ల లోతు గుంతలు దర్శనమి స్తోం ది. గ్రామంలో కనీస వసతులు కూడా లేకపో వడంతో ప్రజలు తీవ్ర  ఇబ్బందులకు గురవుతున్నారు. నూతన పాలకులు, అధికారులు స్పందించి గ్రామంలో   కనీస వసతులైన రో డ్లు, మురుగు కాలువలు నిర్మించి, మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని  ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-03-08T05:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising