ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలిగొండపై వైసీపీ పాలకుల నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2021-08-04T05:38:56+05:30

పశ్చి మ ప్రకాశ చిరకాల స్వప్పమైన వెలిగొండ ప్రా జెక్ట్‌ను పూర్తి చేయడంలో వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దాని సాధన కోసం పో రాటం చేస్తామని టీడీపీ ఎర్రగొండపాలెం ని యోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కందుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాజెక్టు సాధన కోసం పోరాటం

ఎరిక్షన్‌బాబు, కందుల

పెద్దారవీడు(మార్కాపురం), ఆగస్టు 3 : పశ్చి మ ప్రకాశ చిరకాల స్వప్పమైన వెలిగొండ ప్రా జెక్ట్‌ను పూర్తి చేయడంలో వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దాని సాధన కోసం పో రాటం చేస్తామని  టీడీపీ ఎర్రగొండపాలెం ని యోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని రామాయపాలెం, సానికవరం, మద్దలకట్ట, రేగుమానుపల్లి, రాజం పల్లి గ్రామాలలో మంగళవారం గ్రామ కమి టీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా వెంకటరెడ్డి, మాజీ కన్వీనర్‌ గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎం పీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, పార్లమెం ట్‌ కమిటీ సభ్యులు గుమ్మా గంగరాజు, సర్పం చ్‌ ఆకుమల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

ప్రాజెక్టు కోసం పోరాటం

మాజీ ఎమ్మెల్యే కందుల  

మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్ట్‌కు సాధన కోసం పోరాడతామని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  కందుల మాట్లాడుతూ  వైసీపీ వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా  కేంద్ర జలశక్తి సంఘం గుర్తించిన కృష్ణా నదిపై ప్రాజెక్ట్‌ల జాబితాలో వెలి గొండ ప్రాజెక్ట్‌ను చేర్చలేదన్నారు. ఏపీ విభజన చట్టం 11 క్లాజ్‌లోనే వెలిగొండ ప్రాజెక్ట్‌ అంశం పొందు పర్చి ఉందని గుర్తు చేశారు. వెంట నే కేంద్ర జలశక్తి సంఘం జాబి తాలో వెలిగొండ ప్రాజెక్ట్‌ను చేర్చేలా వైసీపీ కేంద్రంపై ఒత్తిడి తేవా లన్నారు.  పోతిరెడ్డిపాడు ప్రా జెక్ట్‌ ద్వారా వెలిగొండ ప్రాజెక్ట్‌కు తీవ్ర నష్టం  జరుగుతుంద నాన్నరు. వెలిగొండ ప్రాజెక్ట్‌కు 842 సిల్‌ లెవల్‌ వద్ద కృష్ణా నది మిగులు జలాలను తీసు కోవాలని నిర్దేశించగా,  పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్‌కు 803 అడుగుల సిల్‌ లెవల్‌ వద్ద నీటిని రాయల సీమకు తరలిస్తున్నా రన్నారు. దీంతో వెలిగొం డకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చే స్తున్నట్లు తెలిపారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఈ నెల 9 నుంచి మా ర్కాపురం నియోజక వర్గంలోని మార్కాపురం పట్టణం, మండలం, పొదిలి, కొనకనమిట్ట, తర్లుపాడు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ దీక్షలను పార్టీలకతీతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనా రాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, కౌన్సిలర్‌ యేరువ నారా యణరెడ్డి పార్టీ నాయకులు గునుపూడి భాస్క ర్‌, పెద బాబు, పీ.శ్రీనివాసలు, ఇబ్రహిం, తది తరులు పాల్గొన్నారు.  





Updated Date - 2021-08-04T05:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising