ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ షాపులపై విజిలెన్స్‌ దాడులు

ABN, First Publish Date - 2021-06-17T05:55:04+05:30

మండలంలోని జానకంపేట, చినలాటవరపి గ్రామాల్లో రెండు రేషన్‌ షాపులపై జిల్లా విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం... జానకంపేట 9 వ నెంబర్‌ రేషన్‌ షాపులో నిల్వ ఉండాల్సిన 39 బస్తాల రేషన్‌ బియ్యం కనిపించకుండా పోయాయని, అదే షాపులో మరో 50 ప్యాకెట్లు పంచాల్సిన చక్కెర, అలాగే 10 ప్యాకెట్ల కందిపప్పు పంచకుండా నిల్వ ఉన్నట్లు గుర్తించారు.

జానంపేటలో రేషన్‌ షాపులని తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుడ్లూరు, జూన్‌ 16 : మండలంలోని జానకంపేట, చినలాటవరపి గ్రామాల్లో  రెండు రేషన్‌ షాపులపై జిల్లా విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం...  జానకంపేట 9 వ నెంబర్‌ రేషన్‌ షాపులో నిల్వ ఉండాల్సిన 39 బస్తాల రేషన్‌ బియ్యం కనిపించకుండా పోయాయని, అదే షాపులో మరో 50 ప్యాకెట్లు పంచాల్సిన చక్కెర, అలాగే 10 ప్యాకెట్ల కందిపప్పు పంచకుండా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా చినలాటవరపిలోని 10 వ నెంబర్‌ రేషన్‌ రేషన్‌ షాపులో 8 బస్తాల రేషన్‌ బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా అవి కనిపించకుండా మాయం అయ్యాయి. అదే షాపులో వినియోగదారులకు అందించాల్సిన 23 ప్యాకెట్ల చక్కెర కూడా నిల్వ ఉన్నట్లు ఈ సందర్బంగా విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో బయటపడ్డాయి. ఈ మేరకు రెండు షాపులకు చెందిన రేషన్‌  డీలర్లు కృష్ణవేణి, సౌమ్యలను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనీఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్ధార్‌ ఎస్‌. రామనారాయణరెడ్డి, ఎస్సై నాగేశ్వరరావు, సిబ్బంది ఫాల్‌స్యామ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T05:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising