ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ఆరాధనోత్సవం

ABN, First Publish Date - 2021-07-31T06:51:27+05:30

ప్రముఖపుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆరాధనోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది.

నారాయణస్వామి ఆలయంలో హోమం నిర్వహిస్తున్న రుత్వికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎ్‌సపురం, జూలై 30 : ప్రముఖపుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆరాధనోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నారాయణస్వామి మూల విరాట్‌ను వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు ప్రసాద్‌శర్మ, సత్యనారాయణశర్మల ఆధ్వర్యంలో గణపతిపూజ, పునఃవచనం, సుదర్శనహోమం, ధన్వంతరి హోమం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి స్వామివారికి పల్లకిసేవ, పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలలో దేవస్థాన చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి, పాలకమండలి సభ్యులు ఆలా కొండమ్మ, సంగిశెట్టి వెంకటలక్ష్మమ్మ, కొమ్మినేని మల్లీశ్వరి, కోలా చిన్నకొండయ్య, మాజీ సర్పంచ్‌ ముడమాల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శాకంబరి అలంకరణలో అమ్మవారు

పామూరు : స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని శుక్రవారం భక్తులు కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా దేవస్ధానంలో ప్రత్యేక పూజల చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్‌ ఏల్చూరి బాలకొండలరావు, గోస్టు రామారావు, విశ్వనాథుని సత్యనారాయణ, దర్శి మస్తాన్‌రావు, మహిళ భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T06:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising