ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొట్టపైర్లకు వానగండం

ABN, First Publish Date - 2021-11-29T07:01:32+05:30

మరోసారి మొదలైన వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు రోజల పాటు భారీ వర్షాలు కొనసాగు తాయని అధికారులు ప్రకటించడంతో ఇక పైర్లు ఏమి మిగలవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వర్షాలకు నీటిలో నానిన పత్తి గుబ్బలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, నవంబరు 28 : మరోసారి మొదలైన వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు రోజల పాటు భారీ వర్షాలు కొనసాగు తాయని అధికారులు ప్రకటించడంతో ఇక పైర్లు ఏమి మిగలవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడురోజులు వర్షాలు కురిస్తే వేలాది ఎకరాల్లో మినుము పూర్తిగా పనికిరాకుండా పోతుందని మిరపతోటలు,పొగతోటలు కూడా ఆనవాళ్లు లేకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ముండ్లమూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మండల కేంద్రం ముండ్లమూరుతో పాటు అన్ని గ్రామాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి గ్రామాల్లోని వీధుల్లో నీరు నిలబడింది. దీంతో ఇళ్ళల్లోని ప్రజలు బయటకు రావాలన్నా కూడా ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం వలన పలు వీధులు చిత్తడిగా మారి పోయాయి. రైతులు సాగు చేసిన పత్తి పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటీవలే మొదటి విడత పత్తి రైతులు విత్తారు. కూలీల డిమాండ్‌ పెరగడంతో రెండో విడత ఆలస్యంగా తీసే సమయానికి వర్షాలతో పొలంలో ఉన్న పత్తి తడిచి పోయింది. దీంతో పొలం వెళ్లిన రైతులు తెల్ల బంగారాన్ని చూసుకొని ఆందోళన చెందారు. పంట కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. 

గుడ్లూరు : విస్తారంగా కురుస్తున్న వర్షాల దాటికి, మండలంలోని ప్రధాన వాగులు, చెరువులు నిండి పోర్లాయి. చేవూరు పెద్దచెరువు, అమ్మవారిపాలెం, గుడ్లూరు, మోచర్ల, పాజర్ల చెరువులకు వర్షాపు నీరు భారీగా చేరింది.  చెరువులు నిండుకుండను తలపించే విధంగా మారాయి. గుడ్లూరు చిన్నచెరుకు, పెద్దచెరువులకు కూడా భారీగా నీరు చేరడంతో అలుగులు పారాయి. ఈ వర్షం మరింతగా కురిస్తే కొన్ని చెరువులు తెగిపోయే పరిస్ధితి ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

దర్శి : దర్శిలో ఆదివారం ముసురుతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో గట్టి జల్లులు కురిశాయి. దీంతో అన్నదాతలు ఆందోళనలు చెందుతున్నారు. పంట దశలో ఉన్న పత్తి, మిర్చి తోటలు దెబ్బతింటాయని వాపోతున్నారు. బోర్లకింద సాగు చేసిన వరిపైరు కోతకొచ్చింది. మాగాణి భూముల్లో సాగుచేసిన కంది ఉరకెత్తే ప్రమాదముంది. అందువలన ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటలను కొల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

దొనకొండ : వర్షాల ప్రభావంతో మిర్చి పంటకు కుచ్చు ముడత తెగుళ్లు సోకి రైతులు అల్లాడుతుండగా ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా మిర్చికి మందు కొట్టేందుకు వీలుకాక మిర్చిపంట మొత్తం నాశనమవుతుందని మిర్చి రైతులు వాపోతున్నారు. ఇదే వర్షం మరో రెండు రోజులు కురిస్తే కంది పంటకు  సైతం పురుగుపట్టే అవకాశం ఉందని చేతికి అందిన పంట చేజారిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-29T07:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising