ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగ స్థల కళాకారుడు వంగల బాలిరెడ్డి మృతి

ABN, First Publish Date - 2021-02-17T07:37:26+05:30

మండలంలోని ఈదర గ్రామానికి చెందిన రంగ స్థల కళాకారుడు వంగల బాలిరెడ్డి(80) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈదర(ముండ్లమూరు), ఫిబ్రవరి 16 : మండలంలోని ఈదర గ్రామానికి చెందిన రంగ స్థల కళాకారుడు వంగల బాలిరెడ్డి(80) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందారు. బాలిరెడ్డి మూడు దశాబ్దాలకు పైగా రంగ స్థల కళాకారుడిగా రాణించారు. సత్యహరిశ్చంద్ర, లక్ష్మీతిరుపతమ్మ నాటకంలో గోపయ్య పాత్ర, శ్రీకృష్ణుడు, సత్యహరిశ్చంద్రుడిలో కాటి సీటు పాత్రల్లో దాదాపు వందలకు పైగా నాటకాలు ప్రదర్శించారు. ఇవి కాక 98 హరే రామక కీర్తన భజనల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో నాటకాలు, భజనలు వివిధ పాత్రలు వేసి మంచి కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. బాలిరెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వచ్చి ఆయన భౌతిక కాయం పై నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి కళాకారుడిని కోల్పొయామన్నారు. ఈదర గ్రామస్థులతో పాటు మండల ప్రజలు సైతం బాలిరెడ్డి ఇక లేరని దుఃఖ సాగరంలో మునిగి పోయారు. ఈదరకు బాలిరెడ్డి వలన గుర్తింపు కూడా వచ్చింది. బాలిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే ఈదర సర్పంచ్‌గా ఎన్నికైన వంగల పద్మావతికి స్వయాన మామయ్య.

Updated Date - 2021-02-17T07:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising