ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాలు వేయించుకోకుంటే జీతాలు నిలిపేస్తాం

ABN, First Publish Date - 2021-02-25T04:59:12+05:30

ఫ్రంట్‌ వారియర్స్‌ అందరూ ఈ నెలాఖరులోగా కరోనా టీకాలు వేయించుకోకపోతే వారి జీతాలను నిలుపుదల చేస్తామని ఎంపీడీఓ ఎం. రంగసుబ్బరాయుడు హెచ్చరించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లకు కొవిడ్‌ 19 కరోనా వ్యాక్సినేషన్‌పై బుధవారం అవగాహన కల్పించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీడీవో హెచ్చరిక

పామూరు, ఫిబ్రవరి 24:  ఫ్రంట్‌ వారియర్స్‌ అందరూ ఈ నెలాఖరులోగా కరోనా టీకాలు వేయించుకోకపోతే వారి జీతాలను నిలుపుదల చేస్తామని ఎంపీడీఓ ఎం. రంగసుబ్బరాయుడు హెచ్చరించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లకు కొవిడ్‌ 19 కరోనా వ్యాక్సినేషన్‌పై  బుధవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఫ్రంట్‌ వారియర్స్‌గా గుర్తించి కరోనా వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా మంజూరు చేసిందని, ఇంకా కొంత మంది ఉద్యోగులు టీకాలపై వస్తున్న వదంతులు నమ్మి వేయించు కోలేదని అన్నారు. జిల్లాలోనే పామూరు మండలం కరోనా వ్యాక్సినేషన్‌లో  దారుణంగా వెనుకబడి ఉందని, ఉద్యోగస్తులందరూ కరోనా వ్యాక్సిన్‌ చేయించుకున్నట్టు సంబంధిత వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటేనే జీతాలు మంజూరు చేయాలని ఆదేశించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఫ్రంట్‌ వారియర్స్‌ అందరూ సకాలంలో టీకాలు వేయించుకొని ప్రజలకు టీకాల పట్ల భరోసా కల్పించి ఆదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్‌డీ వి. బ్రహ్మానందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, వైసీపీ జిల్లా నాయకులు జి. హుస్సేన్‌రెడ్డి, రామిరెడ్డి, పామూరు ఉప సర్పంచ్‌ వైవీ సాయికిరణ్‌, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


 జీతాల బిల్లులు పంపించం 

లింగసముద్రం : కరోనా వైరస్‌ నివారణకు గ్రామ వాలంటీర్లు అందరూ తప్పని సరిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎంపీడీవో కె. మాలకొండయ్య సూచించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోని వలంటీర్లకు జీతాల బిల్లులు పంపించబోమని ఆయన చెప్పారు. మండలంలో 201 మంది వలంటీర్లు పని చేస్తున్నారని, వారంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకొన్నట్టు వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకువస్తేనే జీతాల బిల్లులు పంపుతామని చెప్పారు. 


Updated Date - 2021-02-25T04:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising