ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2021-05-12T07:11:43+05:30

కాకర్ల పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో సుమారు 50వేలకు పైగా జనాభా ఉన్నారు.

మర్రిపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకర్ల (మర్రిపూడి), మే 11 : కాకర్ల పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో సుమారు 50వేలకు పైగా జనాభా ఉన్నారు. 21 గ్రామ పంచాయతీల పరిధిలో 13 సచివాలయాలు నడుస్తున్నాయి. అందులో కాకర్ల ఆరోగ్యకేంద్రం పరిధిలోనే 14 గ్రామ పంచాయతీలు, 8 సచివాలయాలు, 30వేల జనాభా ఉంది. మర్రిపూడి ఆరోగ్యకేంద్రం పరిధిలో 7పంచాయతీలు, 5 సచివాలయాలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మర్రిపూడిలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాకర్లలో మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో మండలంలోని శివారు జంగాలపల్లి, అయ్యపురాజుపాలెం, నర్సరాజుపాలెం. తంగెళ్ల జగ్గరాజుపాలెం గ్రామాల ప్రజలు 40కి.మీ పైగా ప్రయాణించి మర్రిపూడికి రావాల్సి వస్తోంది. దీంతో రద్దీ పెరిగి కరోనా విజృంభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాకర్లలో వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యాధికారి అశ్వని తెలిపారు.


Updated Date - 2021-05-12T07:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising