ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ జోరు

ABN, First Publish Date - 2021-10-23T07:20:59+05:30

ల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు రెండు డోసుల టీకా 61.5శాతం మందికి పూర్తికాగా, మొదటి డోసును 92.2శాతం మంది వేయించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో 61.5శాతం మందికి రెండు డోసులు  

92.2శాతం మందికి మొదటి డోసు పూర్తి

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 22: జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు రెండు డోసుల టీకా 61.5శాతం మందికి పూర్తికాగా, మొదటి డోసును 92.2శాతం మంది వేయించుకున్నారు.   వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారు 22,22,497 మంది ఉండగా ఇప్పటివరకు మొదటి డోసును 20,49,801మంది తీసుకున్నారు. వారిలో జిల్లాతోపాటు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా  ఉన్నారు.  ఇక 45ఏళ్ళకు పైబడిన 10,70,967మంది  మొదటి డోసును వేయించుకున్నారు. అందులో జిల్లాకు చెందిన వారు 9,13,380 మంది, ఇతర ప్రాంతాల వారు 1,57,587 మంది ఉన్నారు. జిల్లాలో రెండు డోసులు 12,59,736మంది (61.5శాతం) వేయించుకున్నారు.  వారిలో 18నుంచి 44 ఏళ్ళలోపు వారు 4,10,023 మంది (41.9శాతం), 45ఏళ్ళకు పైబడిన వారు 8,49,913 మంది (79.3శాతం) ఉన్నారు. జిల్లాలో  శుక్రవారం 127 కేంద్రాల్లో 17,219 మందికి టీకాలు వేసినట్లు  జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.రత్నావళి తెలిపారు. 


18 కొవిడ్‌ పాజిటివ్‌లు

 జిల్లాలో శుక్రవారం 18 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి.  వాటిలో ఒంగోలు అర్బన్‌లో 7, ఒంగోలు రూరల్‌లో 3, కంభంలో 2,కొనకనమిట్లలో 2 ఉన్నాయి.చీమకుర్తి రూరల్‌,దర్శి,మద్దిపాడు, పుల్లలచెరువుల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది. జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 243 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఒక విద్యార్థికి పాజిటివ్‌గా తేలింది. 

Updated Date - 2021-10-23T07:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising