ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-02-02T04:26:22+05:30

టీవీఎ్‌సపై వెళ్తున్న బాలుడిని తప్పించబోయి కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో అం దులో ప్రయాణిస్తున్న బోర్‌వెల్‌ యజమాని పాండురంగారావు(56) అక్కడికక్కడే మృతి చెందాడు.

పాండురంగారావు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు ఎమ్మెల్యే అనుచరులు 

    ప్రయాణిస్తుండగా ఘటన

ప్రధాన అనుచరుడికి గాయాలు

వినుకొండ టౌన్‌, ఫిబ్రవరి 1 : టీవీఎ్‌సపై వెళ్తున్న బాలుడిని తప్పించబోయి కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో అం దులో ప్రయాణిస్తున్న బోర్‌వెల్‌ యజమాని పాండురంగారావు(56) అక్కడికక్కడే మృతి చెందాడు. గిద్దలూరు ఎ మ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న వాహనం సోమవారం శ్రీశైలం ప్రధాన రహదారిపై నడిగడ్డ అడ్డరోడ్డు వద్ద ఈ ప్రమాదానికి గురైంది. వివరాలివి.. అన్నా రాంబాబు ప్రధాన అనుచరుడైన నజీర్‌ అహ్మద్‌ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం ఎమ్మెల్యే కారులో మార్కాపురానికి చెందిన బోర్‌వెల్స్‌ యజమాని పాండురంగారావుతో కలిసి వెళ్లాడు. తిరిగి మార్కాపురం వస్తుండగా ప్రమాదం జరిగింది. పాండురంగారావు అక్కడికక్కడే మృతిచెందగా నజీర్‌ అహమ్మద్‌కు స్వల్పగాయాలు కావడంతో 108 వాహనం ద్వారా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న అన్నా రాంబాబు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు. 




Updated Date - 2021-02-02T04:26:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising