టీడీపీ నేత రామ్మోహన్‌రావుకు ఘన నివాళి
ABN, First Publish Date - 2021-03-26T05:26:00+05:30
మండల కేంద్రమైన ముండ్లమూరులోని టీడీపీ సీనియర్ నాయకుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు బోడపాటి రామ్మోహనరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ముండ్లమూరు, మార్చి 25 : మండల కేంద్రమైన ముండ్లమూరులోని టీడీపీ సీనియర్ నాయకుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు బోడపాటి రామ్మోహనరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన సంస్మరణ కార్యక్రమాలకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే వీరపనేని యలమందరావు, టీడీపీ ఇన్‌చార్జ్ పమిడి రమేష్ హాజరై నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో రామ్మోహనరావు మృతిచెందడం టీడీపీకి తీరని లోటు అన్నారు. ఆయన సొసైటీ అధ్యక్షునిగా పని చేసిన కాలంలో రైతుల సంక్షేమానికి కృషి చేశారన్నారు. వారి కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ మేదరమెట్ల వెంకటరావు, ఏజీపీ వీరపనేని రంగ, బోడపాటి నారాయణరావు, సాంబశివరావు, పీఏసీఎస్ సూపర్ వైజర్ చంద్రమౌళి, కోయ రామకృష్ణ, సుస్మిత, వీరపనేని నారాయణరావు, మేదరమెట్ల వీరనారాయణ, కోటయ్య, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నపురెడ్డి నారాయణరెడ్డి, వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.
Updated Date - 2021-03-26T05:26:00+05:30 IST