ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్టూరులో విజృంభించిన విషజ్వరాలు

ABN, First Publish Date - 2021-10-18T06:00:17+05:30

మార్టూరులో వి షజ్వరాలు ప్రబలుతున్నాయి. సాధారణ జలు బు, జ్వరాలతో పాటు డెంగ్యూ జ్వరాలు సోకే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

మార్టూరులోని ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉన్న రోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దడ పుట్టిస్తున్న డెంగ్యూ

లోపించిన పారిశుధ్యం

పట్టించుకోని అధికారులు

ఆందోళన చెందుతున్న ప్రజలు


మార్టూరు, అక్టోబరు 17: మార్టూరులో వి షజ్వరాలు ప్రబలుతున్నాయి. సాధారణ జలు బు, జ్వరాలతో పాటు డెంగ్యూ జ్వరాలు సోకే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం మార్టూరులోని  తూర్పుబజారులో ఓ మహిళ డెంగ్యూతో మృతి చెందింది. ఆమె భర్త కూడా ప్రైవేటు ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో పోరా డుతున్నాడు. ఈ వీధిలో ఇప్పటికీ నలుగురు వ్యక్తులు డెంగ్యూకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరారు. సంపత్‌ నగ ర్‌లోనూ నలుగురు వ్యక్తులు ఒంగోలు, గుం టూరులోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా రు. నాగరాజుపల్లి రోడ్డులో ఓ గ్రానైట్‌ పరిశ్ర మ యజమాని డెంగ్యూకు గురై స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక  ప్రైవేటు ఆస్పత్రులు విషజ్వరాలతో బాధ పడుతున్న రోగులతో కిటకిటలాడుతున్నాయి. కాగా గ్రామంలో అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. దీంతో దోమల బెడద ఎక్కువయిం ది. పలు కాలనీల్లో మురుగునీరు పేరుకుపోవ డంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీ నికితోడు గ్రామంలో పందుల బెడద అధిక మైంది. సంబంధిత అధికారులు తమకేమి ప ట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తగు చర్యలు తీసుకోకపోవడంతో రోజురోజుకు జ్వరపీడితు లు సంఖ్య పెరుగుతోంది. దీంతో గ్రామస్థులు భయాందోళ చెందుతున్నారు.

 


Updated Date - 2021-10-18T06:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising