ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు ఇళ్లలో దొంగతనాలు

ABN, First Publish Date - 2021-10-17T04:30:47+05:30

కంభం పంచాయతీలోని వై.జంక్షన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి రెండిళ్లలో దొంగతనం జరిగింది.

పరిశీలిస్తున్న ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణ

కంభం, అక్టోబరు 16 : కంభం పంచాయతీలోని వై.జంక్షన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి రెండిళ్లలో దొంగతనం జరిగింది. 3 తులాల బంగారం, 24 తులాల వెండి, రూ.10 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల కథనం మేరకు.. శిరి వాటర్‌ప్లాంట్‌ నడుపుతున్న గంజి వెంకటనారాయణ, పక్క ఇంటిలో ఉన్న మహే్‌షకుమార్‌ కుటుంబాలు దసరా పండుగకు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లారు. అగంతకులు శుక్రవారం రాత్రి రెండు ఇళ్ల తాళాలను పగులగొట్టి చోరీ చేశారు. వెంకటనారాయణ ఇంట్లో బీరువా పగులగొట్టి 2 తులాల బంగారం, 24 తులాల వెండి, రూ.10 వేల నగదు అపహరించారు. విజయవాడలో హోంగార్డుగా పని చేస్తున్న మహే్‌షకుమార్‌ ఇంట్లో ఒకటిన్నర తులం బంగారం అపహరించారు. శనివారం ఉదయం వచ్చిన బాధితులు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు ఇళ్లను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గుడ్లూరులో...

గుడ్లూరు, అక్టోబరు 16 :  ఓ మహిళకు చెందిన 12 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన, గుడ్లూరు - కందుకూరు రోడ్డులోని అంబేద్కర్‌ బొమ్మకూడలిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... గుడ్లూరు ప్రధానవీధిలోజొన్నగడ్డల రమణమ్మ నివాసం ఉంటోంది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక వైపు నుంచి లో పలకు ప్రవేశించారు. బీరువాలో ఉంచిన నాలుగు గాజులు, నల్లపూసల దండ, ఓ ఉంగరం మొత్తం గా 12 సంవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. నిద్ర లేచిన ఆమె అభరణాలు అపహరణకు గురైనట్లు గమనించిన ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. అపహరణకు గురైన 12 సవర్ల బంగారపు ఆభరణాల అంచనా విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని బాధితురాలు పేర్కొన్నారు. ఈ ఘటనపై గుడ్లూరు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు డాగ్‌ స్వాడ్‌తో తనిఖీ చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జున శనివారం చెప్పారు.

Updated Date - 2021-10-17T04:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising