ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ శ్రేణులే సంక్షేమ వారధులు

ABN, First Publish Date - 2021-10-15T06:26:04+05:30

టీడీపీ మనుగడకు, అభివృద్ధికి పార్టీశ్రేణలే సంక్షేమ వారధులుగా శ్రమిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, అక్టోబరు 14: టీడీపీ మనుగడకు, అభివృద్ధికి పార్టీశ్రేణలే సంక్షేమ వారధులుగా శ్రమిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. పట్టణ సమీపంలోని కొత్తూరు (7వార్డు)లో టీడీపీ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత కొత్తూరు అభయాంజనేయస్వామి దేవస్థానంలో పార్టీ శ్రేణులతో కలిసి పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి అశేషంగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులతో  ర్యాలీ నిర్వహించారు. అనంతరం నూతన టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉగ్ర మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దగ్గరగా ఉండేందుకు పార్టీ కార్యాలయాలు ఎంతోదోహద పడతాయన్నారు. తాను రాజకీయ ప్రవేశం నుంచి కొత్తూరు ఎంతో ఆదరించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మనేని శ్రీనివాసులరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి, బొమ్మనబోయిన వెంగయ్య, సీనియర్‌ నాయకులు బొల్లా మాల్యాద్రి చౌదరి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, బుల్లా బాలబాబు, గుడిపాటి ఖాదర్‌, అచ్చాల నాగిరెడ్డి, అచ్చాల రవి, భూమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, బోగాల బాలాజీ, అనీల్‌, తమ్మనేని అల్లూరిరెడ్డి, రాగిపిండి లక్ష్మీరెడ్డి, శరత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T06:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising