ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌ సర్వేను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-10-28T04:33:54+05:30

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమాల అమల్లో జాప్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ హెచ్చరించారు. కనిగిరి మండల పరిధిలోని తాళ్ళూరు, గుడిపాడు గ్రామాల్లోని సచివాలయాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ కనిగిరి మండలంలో ఓటీఎస్‌ సర్వేను సిబ్బంది చురుగ్గా నిర్వహించడం లేదని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.

చనిపోయిన రైతు వివరాలను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  - సబ్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌  

కనిగిరి, అక్టోబరు 27: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమాల అమల్లో జాప్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ హెచ్చరించారు. కనిగిరి మండల పరిధిలోని తాళ్ళూరు, గుడిపాడు గ్రామాల్లోని సచివాలయాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో  మాట్లాడుతూ కనిగిరి మండలంలో ఓటీఎస్‌ సర్వేను సిబ్బంది చురుగ్గా నిర్వహించడం లేదని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా సచివాలయాలకు ఇచ్చిన ప్రింటర్లు, స్కానర్లు, లామినేషన్‌ పరికరాలను వినియోగించక పోవడంపై సబ్‌ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పరికరాలను తెప్పించి వాడుక విధానాన్ని సిబ్బందికి వివరించారు. అనంతరం మండలంలోని కొత్తపాలెం గ్రామంలో గత ఏడాది(2020)లో పురుగు మందు తాగి మృతి చెందిన కల్లూరి బసిరెడ్డి కుటుంబాన్ని కలిసి వివరాలను సేకరించించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఆమెవెంట ఏడీఏ ఈవీ రమణ, తహసీల్దార్‌ పుల్లారావు, ఎంపీడీవో మల్లికార్జునరావు, వివిధశాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఉన్నారు. 

 

Updated Date - 2021-10-28T04:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising