ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కూలిని రూ.350కి పెంచాలి

ABN, First Publish Date - 2021-10-27T05:19:17+05:30

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ కూలి రూ.246 నుంచి రూ.350కి పెంచాలని లబ్ధిదారులు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జిల్లా అడిషనల్‌ పీడీ వెంకట్రామిరెడ్డిని కోరారు.

ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అడిషనల్‌ పీడీని కోరిన లబ్ధిదారులు

కొమరోలు, అక్టోబరు 26 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ కూలి రూ.246 నుంచి రూ.350కి పెంచాలని లబ్ధిదారులు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జిల్లా అడిషనల్‌ పీడీ వెంకట్రామిరెడ్డిని కోరారు. మండలంలోని దద్దవాడ గ్రామ పం చాయతీలో సంషద్‌ ఆదర్శ గ్రామంలో భాగంగా మంగళవారం అన్నిశాఖల పని తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీడీ వెంక ట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేసే బాధ్యత ఆయా శాఖలపై ఉందన్నారు.  అర్హులందరికీ పింఛన్‌, రేషన్‌ కార్డులు, ఇం టి స్థలాలు అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు, కరెంట్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో ఉపాధి వేతనాన్ని రూ.246 నుంచి రూ.350కి పెంచాలన్నారు. ప్రతి ఒక్కరికీ 100రోజుల పనిదినాలు కల్పించాలని లబ్ధిదారులు కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ముకుందన్‌, భాస్కర్‌, డీఎల్‌పీవో నాగేశ్వరరావు, తహసీల్దార్‌ నాగూర్‌మీరా, ఎంపీడీవో చల్లా శ్రీనివాస్‌ కుమార్‌, ఏపీవో మహాలక్ష్మి, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising