తెలుగు ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా తేజశ్విని
ABN, First Publish Date - 2021-10-04T05:08:03+05:30
తెలుగుదేశం పార్టీ అనుబంధ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఒంగోలుకు చెందిన పొడపాటి తేజశ్విని నియమితులయ్యారు. ఈ నూతన విభాగాన్ని అమరావతిలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సారథ్య బాధ్యతలను తేజశ్వినికి అప్పగించారు. ఆమె భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. టీడీపీ హయాంలో వేలాది మంది యువతతో కలిసి స్వచ్ఛాంధ్రలో పాలుపంచుకున్నారు.
భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా ఇప్పటికే గుర్తింపు
ఒంగోలు (కార్పొరేషన్), అక్టోబరు 3 : తెలుగుదేశం పార్టీ అనుబంధ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఒంగోలుకు చెందిన పొడపాటి తేజశ్విని నియమితులయ్యారు. ఈ నూతన విభాగాన్ని అమరావతిలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సారథ్య బాధ్యతలను తేజశ్వినికి అప్పగించారు. ఆమె భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. టీడీపీ హయాంలో వేలాది మంది యువతతో కలిసి స్వచ్ఛాంధ్రలో పాలుపంచుకున్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల ప్రహరీ గోడలపై బొమ్మల గీసి అందరి ప్రశంసలు పొందారు. స్వచ్ఛభారత్ కోసం ఆమె చేసిన కృషికి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడే అవకాశం పొందడమే కాకుండా, ఆయన అభినందనలు అందుకున్నారు. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలిగా నియమితులైన తేజశ్వినిని పలువురు అభినందించారు.
Updated Date - 2021-10-04T05:08:03+05:30 IST