ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

ABN, First Publish Date - 2021-11-27T05:21:42+05:30

రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత గృహహక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) విశ్వనాథ్‌ అన్నారు.

లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, నవంబరు 26: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత గృహహక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) విశ్వనాథ్‌ అన్నారు. శుక్రవారం గిద్దలూరు పట్టణంలోని నంద్యాల రోడ్డులో గల సచివాలయంతోపాటు కేఎస్‌పల్లె సచివాలయంలో ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కింద పలువురు లబ్ధిదారులకు రుణవిముక్తి పత్రాలను అందజేశారు. కార్యక్ర మంలో నగర కమిషనర్‌ రామక్రిష్ణయ్య, తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, ఎంపీడీవో రంగనాయకులు, హౌసింగ్‌ డీఈ ఖాదర్‌, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు. 

ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలి

కొమరోలు, నవంబరు 26: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)పై ప్రజలకు అవ గాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.విశ్వనాథం అన్నారు. శుక్రవారం కొమ రోలు పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా బాదినేనిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ మాట్లాడుతూ  ఇ టీవల వర్షాలకు పంటలు నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నామన్నారు. ఈతరుణంలో రుణం చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీ నిపై జేసీ మాట్లాడుతూ బలవంతంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పొ దుపు ద్వారా రుణాలను అందజేస్తారని చెప్పారు. దీనిపై వలంటీర్లు మాట్లాడు తూ కొందరు గ్రూపు సభ్యులు ఒప్పుకోవటంలేదని, గ్రూపు తరుపున కాకుండా వ్యక్తిగతంగా వారికి రుణాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో  డీఈ ఖాదర్‌ బాషా, ఎంపీడీవో శ్రీనివాస కుమార్‌, తహసీల్దార్‌ నాగూర్‌ మీరా పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T05:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising