ఎస్‌డబ్ల్యూపీసీలపై మళ్లీ ప్రభుత్వం దృష్టి
ABN, First Publish Date - 2021-08-15T04:48:43+05:30
గత టీడీపీ ప్రభుత్వ కాలంలో చురుకుగా నిర్మాణాలు కొనసాగిన ఎస్‌డబ్ల్యూపీసీ(చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం)లపై రెండేళ్ల తర్వాత ప్రభుత్వ దృష్టి సారించింది. నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయినవి, మరమ్మతుల చేయవలసినవి, అసలు నిర్మాణాలే ప్రారంభం కానివి తేల్చి నివేదిక పంపమని కోరడంతో ఇప్పుడు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సిబ్బంది ఆపనుల్లో బిజీ అయ్యారు
టంగుటూరు, ఆగస్టు 14 : గత టీడీపీ ప్రభుత్వ కాలంలో చురుకుగా నిర్మాణాలు కొనసాగిన ఎస్‌డబ్ల్యూపీసీ(చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం)లపై రెండేళ్ల తర్వాత ప్రభుత్వ దృష్టి సారించింది. నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయినవి, మరమ్మతుల చేయవలసినవి, అసలు నిర్మాణాలే ప్రారంభం కానివి తేల్చి నివేదిక పంపమని కోరడంతో ఇప్పుడు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సిబ్బంది ఆపనుల్లో బిజీ అయ్యారు
మండలంలోని 18 పంచాయతీల్లో 18 ఎస్‌డబ్ల్యూఎస్ కేంద్రాల నిర్మాణాలకు అప్పట్లో ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. గ్రామాల్లోని ఇంటింటి నుంచి పంచాయతీ ఆధ్వర్యాన తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి ఈకేంద్రాలకు చేర్చి, ఈవిధంగా సేకరించిన చెత్తను వేరువేరుగా తొట్టుల్లో వేసి అందులో నుంచి ఎరువు తయారీకి అప్పట్లో ఈకేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. వీటి ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పాటించడంతోపాటుగా వేస్ట్ పదార్థాల నుంచి ఎరువును తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉండేది. చెత్త సేకరణకు పంచాయతీ వారు ట్రైసైకిళ్లు ఇస్తారు. ఈపనుల కోసం గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ద్వారా కొందరికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యంగా కూడా ఉంది. అయితే మండలంలో మంజూరైన వాటిలో ఆలకూరపాడు, వల్లూరు, సూరారెడ్డిపాలెం, కొణిజేడు, జమ్ములపాలెం పంచాయతీల్లో ఎస్‌డబ్ల్యూపీసీల నిర్మాణాలే ప్రారంభం కాలేదు. అనంతారంలో నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. మిగిలిన 12 పంచాయతీల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలు మరమ్మతులకు నోచుకున్నాయి. కొన్నింటి పైకప్పులు లేచిపోయాయి. తొట్లకు పగుళ్లు వచ్చాయి. వీటి మరమ్మతుల పూర్తి చేయాలి. ఒక్క టంగుటూరు మినహా ఎక్కడా ఇవి ప్రస్తుతం వినియోగంలో లేవు
ఎస్‌డబ్ల్ల్యూపీసీ కేంద్రాల స్థితిగతులపై యాప్
ఎస్‌డబ్ల్ల్యూపీసీ కేంద్రాల స్థితిగతుల నమోదుకు వీలుగా ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సిబ్బంది సెల్‌ఫోన్లలో ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. ఏపీవో సారఽథ్యంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ఉద్యోగులు ఇప్పటికే వారి వద్ద ఉండే సమాచారం ఆధారంగా గ్రామాలకు వెళ్లి ఈ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. కేంద్రాల ప్రస్తుత స్థితిని పరిశీలించి ఆ యాప్‌లో యథావిధిగా నమోదు చేస్తున్నారు
వినియోగంలోకి తెచ్చేందుకే..
నిర్మాణాలు ప్రారంభం కాని గ్రామాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని, మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలు తిరిగి పూర్తి చేయాలి. మరమ్మతులకుగురైన కేంద్రాల్లో మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఈపెండింగ్ పనులన్నీ పూర్తి చేసి త్వరగా వినియోగంలోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. అందుకే ఈహడావుడిని సమాచారం.
చెత్త నుంచి సంపద తయారీయే లక్ష్యం
చెత్త నుంచి సంపద తయారీయే ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాల లక్ష్యం. నిర్మాణాలన్నీ పూర్తికాగానే అదనపు సౌకర్యాలు కల్పిస్తాం. తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి వేస్ట్ పదార్థాలన్నీ మిషన్లో వేసి ఎరువుగా మార్చుతాం. ఈ విధంగా తయారయిన ఎరువును రైతులకు అందిస్తాం. అలాగే కేంద్రాల వద్ద ట్రైసైకిళ్లు పెట్టుకునేందుకు వీలుగా షెడ్డు నిర్మాణం, ఆఫీస్ గది, మరుగుదొడ్లు అదనపు సౌకర్యాల కింద నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందుకు రూ. 2 లక్షలు వ్యయం చేస్తాం.
- బత్తుల నాగేశ్వరరావు, ఏపీవో, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స
Updated Date - 2021-08-15T04:48:43+05:30 IST