ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠకు తెర

ABN, First Publish Date - 2021-01-26T06:34:44+05:30

పంచాయతీ ఎన్నికలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు లైన్‌క్లియర్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సుప్రీం కోర్టు  గ్రీన్‌సిగ్నల్‌

మూడు దశలు...1,035 పంచాయతీలకు ఎన్నికలు 

వచ్చేనెల 9, 13, 17 తేదీల్లో పోలింగ్‌

ఈనెల 29 నుంచి తొలివిడత నామినేషన్లు

ఒంగోలు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు లైన్‌క్లియర్‌ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఇచ్చే షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సోమవారం ఉత్తర్వులిచ్చింది. తదనుగు ణంగా ఎస్‌ఈసీ గతంలో ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ తాజాగా సోమవారం సాయంత్రం రీషెడ్యూల్‌ ప్రకటించింది. కాగా జిల్లాలో మొత్తం 1,050 పంచాయతీల్లో వివిధ కారణాలతో 15 పంచాయ తీల్లో ఎన్నికలు ఆగిపోగా మిగిలిన 1,035 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఆ పరిధిలోని 10,336 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కూడా రాష్ట్రంలో నాలు గు దశల్లో ఎన్నికలు జరగనుండగా జిల్లాలో మూడు దశల్లోనే వాటిని పూర్తిచేయనున్నారు. గతంలోనే మూడు దశల ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం చేసిన ప్రతిపాదనలకు ఎస్‌ఈసీ ఆమోదం తెలి పింది. కాగా గత షెడ్యూల్‌లో రెండో విడత నుంచి ఎన్నికలు జరు గుతాయని ప్రకటించారు. అయితే రీషెడ్యూల్‌లో రెండో విడతనే మొదటి విడతగా మార్పు చేశారు. ఆ ప్రకారం తొలివిడత ఒంగో లు రెవెన్యూ డివిజన్‌లోని 20 మండలాల్లోని 349 పంచా యతీల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండవ విడత మార్కా పురం డివిజన్‌లోని 12 మండలాలతో పాటు దర్శి నియో జకవర్గంలోని ఐదు మండలాలు కలిపి 17 మండలా ల్లోని 308 పంచాయతీలు, మూడవ విడతలో కందుకూరు డివిజన్‌లోని 19 మండలాల్లో గల 378 గ్రామ పంచాయతీల్లో ఎన్ని కలు జరగనున్నాయి. ఆ మేరకు స్పష్టత వచ్చింది.


తొలివిడత

ఎన్నికలు జరిగే పంచాయతీ : 349

నామినేషన్ల స్వీకరణ: జనవరి 29నుంచి 31 వరకు

ఉపసంరణల తుదిగడువు: పిబ్రవరి 4

పోలింగ్‌: ఫిబ్రవరి 9వతేదీ


రెండవ విడత

ఎన్నికలు జరిగే పంచాయతీలు: 308

నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 2నుంచి 4 వరకు

ఉపసంహరణల గడువు: ఫిబ్రవరి 8 

పోలింగ్‌ : పిబ్రవరి 13


మూడవ విడత

-------------------

ఎన్నికలు జరిగే పంచాయతీలు: 378

నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 6నుంచి 8 వరకు

ఉపసంహరణలు: ఫిబ్రవరి 12

పోలింగ్‌ : ఫిబ్రవరి 17



Updated Date - 2021-01-26T06:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising