ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భావన్నారాయణునికి సూర్యకిరణాభిషేకం

ABN, First Publish Date - 2021-03-07T07:03:58+05:30

భావన్నారాయణున్ని భానుడు అభిషేకించిన సుందర దృశ్యం మండలంలోని పెదగంజాం గ్రామంలో శనివారం ఉదయం ఆవిష్కృతమైంది.

పెదగంజాంలోని భావన్నారాయణుని తాకిన సూర్యకిరణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చినగంజాం, మార్చి 6 : భావన్నారాయణున్ని భానుడు అభిషేకించిన సుందర దృశ్యం మండలంలోని పెదగంజాం గ్రామంలో శనివారం ఉదయం ఆవిష్కృతమైంది. ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబరు మొదటివారాల్లో భావనారాయణస్వామిని సూర్య కిరణాలు తాకుతాయి. ఈ నెల ప్రారంభం నుంచి భక్తులు ఈ అపూర్వదృశ్యాన్ని చూసేందుకు రోజూ ఉదయం ఆలయం వద్దకు వస్తుంటారు. శనివారం ఉదయం 6.25  నుంచి 6.35 వరకు భానుడి   సూర్యకిరణాలు భూనీల సమేత భావనారాయణస్వామి ఆలయంలో కనువిందు చేశాయి. స్వామి మూలవిరాట్టు ఎడమ చేతి శంఖం నుంచి పాదాల వరకు, అమ్మవారి కుడి చేతిని సూర్యకిరణాలు తాకే అపూర్వదృశ్యాన్ని భారీగా తరలివచ్చిన భక్తులు చూసి తరించారు. ఆలయ అర్చకులు బృందావనం రాఘవాచార్యులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈనెల 9వ తేదీ వరకు స్వామిని సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని అర్చకులు తెలిపారు.



Updated Date - 2021-03-07T07:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising