ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలాహలంగా శిద్దా సుధీర్‌ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-10-17T05:59:27+05:30

జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ యువ నాయకుడు శి ద్దా సుధీర్‌కుమార్‌ జన్మదిన వేడుకలు శనివారం ఘనం గా జరిగాయి.

ఒంగోలులో కుటుంబ సభ్యుల మద్య బర్త్‌డే కేక్‌కట్‌ చేస్తున్న సుధీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ యువ నాయకుడు శి ద్దా  సుధీర్‌కుమార్‌ జన్మదిన వేడుకలు శనివారం ఘనం గా జరిగాయి. వందలాది మంది శిద్దా కుటుంబ అభిమా నులు, గ్రానైట్‌ ఇతర వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు వేడుకల్లో పాల్గొని సుధీ ర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలులోని శిద్దా నివాసంతో పాటు చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో కోలా హలంగా వేడుకలు జరిగాయి. తల్లిదండ్రులు మాజీమం త్రి శిద్దా రాఘవరావు, లక్ష్మీపద్మావతి, సుధీర్‌ సతీమణి శృతిలతో కలిసి ఒంగోలులోని నివాసంలో అభిమానులు మధ్య ఉదయం బారీ కేక్‌ను సుధీర్‌ కట్‌ చేశారు. 

అనంతరం ఒంగోలు నుంచి చీమకుర్తి హరిహరక్షేత్రం వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించి అక్కడ  కూడా కేక్‌ కట్‌ చేశారు. కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వ హించారు. దర్శిలో శిద్దా యూత్‌ అబిమానులు అక్కడి ఆంజనేయస్వామి గుడిలో పూజలు నిర్వహించారు. సుధీర్‌ పుట్టిన రోజు సందర్భంగా చీమకుర్తిలో దాదాపు 200 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం బస్తాలు పంపి ణీ చేశారు. ఒంగోలులో స్మైల్‌ సంస్థ ద్వారా 50మంది ఆంధులకు బ్లైండ్‌ టాకింగ్‌ వాచీలు, దర్శిలో 60మంది వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

శిద్దా గ్రూపు సంస్థల్లోని వివిధ విభాగాలకు చెందిన అద్దంకి మురళీకృష్ణ, కృష్ణప్రసాద్‌, ఎ.గిరి, ఉప్పుటూరి కృష్ణ, మణికంఠ, శిద్దా లోహిత్‌, ఎం.శివరామ్‌ తదితరుల ఆధ్వ ర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఒంగోలు, సంత నూతల పాడు, దర్శి నియోజకవర్గాల్లోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వివిధ రంగాలకు చెందిన వారు వేడుకల్లో పాల్గొన్నారు. ఆలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెం దిన ఆర్యవైశ్య సంఘాలు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతి నిధులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా రంగాలకు చెదిన సత్య సుదాకర్‌, వేమా శ్రీనివాసరావు, గుమ్మడి సా యిబాబు, బొమ్మిశెట్టి  కిరణ్‌, చలమయ్య, శాసనాల వీర బ్రహ్మం తదితరులు సుధీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-10-17T05:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising