ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరగతి గదుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-05-14T06:22:13+05:30

అదనపు తరగతి గదుల పనులను వేగవంతం చేయాలని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ బార్గవ్‌తేజ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ భార్గవతేజ

వలేటివారిపాలెం, మే 13: అదనపు తరగతి గదుల పనులను వేగవంతం చేయాలని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ బార్గవ్‌తేజ తెలిపారు. వలేటివారిపాలెం హైస్కూల్‌లో నాడు నేడు పథకం కింద రూ 59.50 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. తరగతి గదులకు ఏర్పాటుచేసిన కిటికీలు, తలుపులు, ఎలక్ర్టికల్‌ మెటీరియల్‌, గ్రానైట్‌ తదితర నాణ్యత ఏర్పాట్లను పరిశీలించారు. తాగునీరు, టాయ్‌లెట్లు, వంటగది, తదితర వసతులను అడిగి తెలుసుకున్నారు. అదనపు తరగతి నిర్మాణ పనులను నాణ్యతతో పాటు జాప్యం లేకుండా వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సయ్యద్‌ ముజిఫర్‌ రెహ్మన్‌, ఎంపీడీవో రఫీద్‌ అహ్మద్‌, ఎస్సై చావా.హజరత్తయ్య, మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, వైసీపీ నాయకుడు పరిటాల వీరా స్వామి, ఏపీఎం హనుమంతరావు, ఆర్‌ఐ ప్రసా ద్‌, వీఆర్వోఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రం పరిశీలన

లింగసముద్రం : కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ వేసుకున్న వారికి మాత్రమే రెండో డోస్‌ వేయాలని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ ఏ భార్గవ్‌ తేజ చెప్పారు. గురువారం లింగసముద్రంలోని కేఆర్‌ జడ్పీ హైస్కూ ల్‌లో జరుగుతున్న కరోనా సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు.  రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తయిన తరవాతనే మొదటి డోస్‌ వారికి వ్యాక్సిన్‌ వేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.బ్రహ్మయ్య, ఎంపీడీవో కె.మాల కొండయ్య, వైద్యాధికారి డా.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T06:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising