ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి కట్టుదిట్ట చర్యలు

ABN, First Publish Date - 2021-05-18T06:50:01+05:30

తాళ్లూరు : మండంలోని గ్రామాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో మండల టాస్క్‌ఫోర్సు బృందం అప్రమత్తమయింది.

తాళ్లూరులో టీకాల కోసం కేంద్రానికి వచ్చిన జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లూరు : మండంలోని గ్రామాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో మండల టాస్క్‌ఫోర్సు బృందం అప్రమత్తమయింది. కరోనా కేసులు అధికంగా ఉన్న గ్రామాల్లో సోమవారం కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి ప్రజల రాకపోకలు నిషేధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ వచ్చినా తమకు ఎటువంటి లక్షణాలు లేవంటూ వీధుల్లోకి వస్తుండటంతో  ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదముందని తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య తెలిపారు. పాజిటివ్‌ వ్యక్తులు హోం క్వారంటైన్‌లో ఉండాలని పచెప్పారు. ఇంటిలో వుండేందుకు ఇబ్బందిగా వుంటే దర్శిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఇంటిలో ఒకరికి పాజిటివ్‌ వస్తే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ వున్న వ్యక్తులు తమంటతాముగా  హోం ఐసోలేషన్‌ ఉండాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల ఇళ్లకువెళ్లి టాస్క్‌ఫోర్సు బృందం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తాళ్లూరు, తూర్పుగంగవరం, నాగంబొట్లపాలెం పంచాయతీలను రెడ్‌జోన్లుగా ప్రకటించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో జరుగుతున్న కర్ఫ్యూ తీరును తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, ఎంపీడీవో కేవీ,కోటేశ్వరరావు, ఈవోఆర్డీ దారా హనుమంతరావు పరిశీలించి ప్రజలకు తగు సూచనలు చేశారు.

కరోనాతో అప్రమత్తం

తాళ్లూరు, మే 17: మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామంలో మూడురోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. గ్రామంలో అధికంగా కరోనా కేసులు నమోదు కావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై సోమవారం వైద్య శిబిరం ఏర్పాటుచేసింది. తూర్పుగంగవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యుడు బి.రత్నం ఆధ్వర్యంలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 48 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వున్నట్లు గుర్తించారు. ఈ సందర్బంగా  వైద్యాధికారి రత్నం మాట్లాడుతూ భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. రెండవ డోస్‌ వారికి వ్యాక్సిన్‌ ఇచ్చారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ చిమటా సుబ్బారావు, కార్యదర్శి పి.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 పామూరు, మే 17 : కరోనా టీకా మొదటి డోస్‌ వేయించుకున్న 12 వారాల తర్వాతనే రెండో డోసు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయం తెలియకపోవడంతో 8 వారాలు పూర్తయిన అనేక మంది ఆయా కేంద్రాలకు వచ్చారు. వైద్య సిబ్బంది 12 వారాల తర్వాత రావాలని చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. పామూరులో సోమవారం 50 మందికి  కొవాగ్జిన్‌ వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.


Updated Date - 2021-05-18T06:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising