ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు వేలాన్ని అడ్డుకున్న రైతులు

ABN, First Publish Date - 2021-07-24T05:30:00+05:30

లోగ్రేడ్లు, నాణ్యమైన పొగాకుకు గిటుబాటు ధరలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు శనివారం వేలాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు. చేసేది లేక వేలం కేంద్రం అధికారులు వేలం నిలిపివేశారు. శనివారం కమ్మవారిపాలెం, కట్టుబడివారిపాలెం రైతులు తమ పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తెచ్చారు. రైతుల నుంచి 1,012 పొగాకు బేళ్లకు అధికారులు అనుమతించారు. వేలం ప్రారంభం నుంచి ధరలు పతనం కావడాన్ని గమనిస్తున్న రైతులు 371 బేళ్ల వేలం కాగానే కొనుగోళ్లు నిలిపివేశారు.

టంగుటూరు కేంద్రంలో కొనసాగుతున్న పొగాకు వేలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టంగుటూరు, జులై 24 : లోగ్రేడ్లు, నాణ్యమైన పొగాకుకు గిటుబాటు ధరలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు శనివారం వేలాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు. చేసేది లేక వేలం కేంద్రం అధికారులు వేలం నిలిపివేశారు. శనివారం కమ్మవారిపాలెం, కట్టుబడివారిపాలెం రైతులు తమ పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తెచ్చారు. రైతుల నుంచి 1,012 పొగాకు బేళ్లకు అధికారులు అనుమతించారు. వేలం ప్రారంభం నుంచి ధరలు పతనం కావడాన్ని గమనిస్తున్న రైతులు 371 బేళ్ల వేలం కాగానే కొనుగోళ్లు నిలిపివేశారు. ధరలు దారుణంగా ఉన్నాయని, గిట్టుబాటు ధరలు కావాలని రైతులు కోరారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తున్నారని, ధరలు పతనావస్థకు చేరాయని రైతులు మండిపడ్డారు. పంట ఉత్పత్తి వ్యయం పెరిగిన  ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఈవిధంగా తగ్గిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దశలో అధికారులు వ్యాపారులతో జరిపిన చర్చలు ఫలించలేదు. ధరలు పెంచేందుకు వ్యాపారులు అంగీకరించక పోవడం, తగ్గిన ధరలకు తమ పొగాకు ఇచ్చేందుకు రైతులు అంగీకరించకపోవడంతో అధికారులు వేలాన్ని నిలిపివేశారు. అప్పటికీ వేలం జరిగిన 371 బేళ్లలో వివిధ కారణాలతో 75 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. బేళ్ల తిరస్కరణలను చూసిన రైతులు మరింత ఆగ్రహం చెందారు. గరిష్ఠ ధర రూ. 174 కాగా, కనిష్ఠ ధర రూ. 75 రైతులకు దక్కింది. సోమవారం యఽథావిధిగా పొగాకు కొనుగోళ్లు జరుగుతాయని వేలం కేంద్రం ఇన్‌చార్జి కిరణ్‌ తెలిపారు.


Updated Date - 2021-07-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising