ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉందాం

ABN, First Publish Date - 2021-05-07T06:44:38+05:30

కరోనాలాంటి విపత్కర పరిస్థితిలో ప్రజలకు ప్రభుత్వాధికారులు అండగా నిలవాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మధుసూధన్‌యాదవ్‌

కనిగిరి, మే 6: కరోనాలాంటి విపత్కర పరిస్థితిలో ప్రజలకు ప్రభుత్వాధికారులు అండగా నిలవాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ మండలస్థాయి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.  కరోనా నిబంధనల సడలింపు సమయంలో వివిధ పనుల నిమిత్తం షాపులకు వచ్చిన ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. ఆ సమయంలో బందోబస్తుగా ఉన్న పోలీసు సిబ్బంది నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు తీవ్రంగా వచ్చిన ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీ కేంద్రంలో కరోనా బాధితులకు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కరోనా లక్షణాల తీవ్రంగా ఉన్నవారిని కనిగిరిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కరోనాకేర్‌ సెంటర్‌కు తరలించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు వైద్యం పట్ల నమ్మకం పెంచే విధంగా వారిలో భరోసా కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలో కరోనా నిబంధనలు, జాగ్రత్తలు తెలియజేస్తూ అధికారులతో కలసి పర్యటించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి, పీడీ శీనారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, తహసీల్దార్లు పుల్లారావు, జ్వాలా నరసింహం, ఉష, సింగారావు, ఎంపీడీవోలు మల్లిఖార్జునరావు, రంగపుల్లయ్య, వైద్యులు నాగరాజ్యలక్ష్మి, సునీత, షరీఫ్‌, ఎస్సైలు రామిరెడ్డి, రాజ్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రీహరి, నాయకులు రంగనాయకులరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T06:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising