ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీరామ నవమిని ఇళ్లలోనే చేసుకోండి

ABN, First Publish Date - 2021-04-21T05:36:39+05:30

బుధవారం జరుగనున్న శ్రీరామనవమి పండుగను ఇంటి వద్దే పరిమితమై పండుగను నిర్వహించుకోవాలని సీఐ యు.సుధాకర్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీఐ

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 20 : బుధవారం జరుగనున్న శ్రీరామనవమి పండుగను ఇంటి వద్దే పరిమితమై పండుగను నిర్వహించుకోవాలని సీఐ యు.సుధాకర్‌రావు అన్నారు. కరోనా విజృంభిస్తున్న సందర్భంగా గుంపులు గుంపులుగా గుళ్లకు వెళ్లొద్దని, ఉత్సవాలు నిర్వహించరాదని ఆయన సర్కిల్‌ పరిధిలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేట ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ప్రజలంతా సహకరించాలని, మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ కరోనా వ్యాప్తికి కారకులైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

కంభంలో..

కంభం :  కరోనా తీవ్రరూపం దాల్చుతున్నందున కంభం, అర్థవీడు మండలా ల ప్రజలు శ్రీరామ నవమి పండుగను  ఇళ్లవద్దనే జరుపుకోవాలని కంభం, అర్థవీడు ఎస్‌ఐలు మాధవరావు, వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలందరూ సహకరించాలని, మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తిరునాళ్లకు అనుమతి లేదు  

పుల్లలచెరువు : గ్రామాల్లో ఉత్సవాలు, తిరునాళ్లకు అనుమతి లేదని తహసీ ల్దార్‌ సీహెచ్‌.అశోక్‌రెడ్డి తెలిపారు. కరోనా  కేసులు ప్రబలతున్న నేపథ్యంలో మంగళవారం పుల్లలచెరువులో మాస్కులను పంపిణీ చేశారు. ఎస్‌ఐ వి.సుధాకర్‌ మాట్లాడుతూ తిరునాళ్లు, బహిరంగ ఉత్సవాలు, ప్రభలు, సాంస్కృతిక కార్య క్రమాలపై నిషేధం విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో రాజ్యలక్ష్మి, వైద్యాధికారి గౌతమి పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T05:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising