ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం

ABN, First Publish Date - 2021-05-11T05:55:34+05:30

మార్కాపురం జిల్లా వైద్య శాలలో కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అం దించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సురేష్‌ వెల్లడిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కాపురం జిల్లా వైద్యశాలలో

త్వరలో 30 వెంటిలేటర్ల ఏర్పాట్లు

తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కోసం 

రూ.48 లక్షలతో ప్రతిపాదనలువంద పడకలతో జర్మన్‌ షెడ్ల నిర్మాణం

 మంత్రి సురేష్‌ వెల్లడి

మార్కాపురం, మే 10: మార్కాపురం జిల్లా వైద్య శాలలో కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అం దించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సురేష్‌ వెల్లడిం చారు. స్థానిక జార్జి అతిథి గృహంలో సోమవారం ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైద్యశాలలో పనిచేసే సిబ్బందికి 200 పీపీఈ కిట్లతోపాటు, బాధితు లకు అవసరమైన  ఆక్సిజన్‌ సిలెండర్లను అందజేసినట్లు తెలిపారు. మార్కాపురం శాసనసభ్యుడు  కుందురు నా గార్జునరెడ్డి సూచనల మేరకు జిల్లా వైద్యశాలలో మరో వంద పడకల ఏర్పాటుకు అవసరమైన జర్మన్‌ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపామని చెప్పారు. నాలుగైదు రోజుల్లో వాటిని పూర్తి  చేస్తామ న్నారు. మార్కాపురం వైద్యశాలకు ప్రభుత్వం 30 వెంటి లేటర్లను సరఫరా చేయడం జరిగిందని, అవి త్వరలోనే వినియోగంలోకి వస్తాయన్నారు. తాగునీరు, విద్యుత్‌ సౌ కర్యం మెరుగుపర్చేందుకు రూ.46.30 లక్షలు అవసర మని ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింద న్నారు. ఈ విషయంపై రాష్ట్ర కొవిడ్‌ కమాండెంట్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్‌ కోఆర్డినేటర్‌, జిల్లా కలెక్టర్‌ తదితరులతో చర్చించడం జరిగిందన్నారు. కొత్తగా ఐదుగురు నర్సులను జిల్లా వైద్యశాలలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 


Updated Date - 2021-05-11T05:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising