ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలుచోట్ల సంపూర్ణ లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-05-24T06:00:56+05:30

జిల్లాలో 20వ రోజైన ఆదివారం కూడా కర్ప్యూ అమలు కొనసాగింది. ఆదివారం కావడంతో సాధారణంగా సడలింపు వేళ కూడా జన సంచారం అంతంతమాత్రంగానే కనిపించింది. దీనికి తోడు ఒంగోలు నగరంతో పాటు పలు ఇతరచోట్ల సాయంత్రం సమయంలో పోలీసులు తనిఖీలు కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా పలుప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను స్థానిక అధికారులు అమలు చేశారు.

సంపూర్ణలాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన దర్శి పట్టణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు , మే 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 20వ రోజైన ఆదివారం కూడా కర్ప్యూ అమలు కొనసాగింది. ఆదివారం కావడంతో సాధారణంగా సడలింపు వేళ కూడా జన సంచారం అంతంతమాత్రంగానే కనిపించింది. దీనికి తోడు ఒంగోలు నగరంతో పాటు పలు ఇతరచోట్ల సాయంత్రం సమయంలో పోలీసులు తనిఖీలు కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా పలుప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను స్థానిక అధికారులు అమలు చేశారు. ప్రధానంగా కందుకూరు, కనిగిరి, దర్శి పట్టణాలతో పాటు జరుగుమల్లి, వీవీపాలెం, గుడ్లూరు పలు ఇతర మండల కేంద్రాల్లోనూ సంపూర్ణ లాక్‌డౌన్‌ నిర్వహించారు. ఆ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నిరకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోగా ఆదివారం పగలు, రాత్రంతా ఆంక్షలు అమలుచేశారు. ఇతర అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేశారు. చీమకుర్తిలో కేవలం ఉదయం 6నుంచి 9గంటల వరకు మాత్రమే సడలింపు కొనసాగింది. ఆ సమయంలో కూడా జిల్లా అంతటా మటన్‌,చికెన్‌,చేపలు విక్రయాలను అధికారులు ఆపేశారు. అయితే కొన్ని చోట్ల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో దొంగచాటుగా వ్యాపారం కొనసాగింది. అంతేగాక అధిక ధరలకు విక్రయించారు.  

Updated Date - 2021-05-24T06:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising