ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీయాలి

ABN, First Publish Date - 2021-04-19T06:26:17+05:30

పాఠశాలలకు వచ్చే విద్యార్థినీ, విద్యార్థుల్లో వారిలో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీసి, వారి భావి జీవితానికి బంగారు బాటలు వేయాలని ఎంఈవో ప్రసాద్‌రావు అన్నారు.

భరతనాట్యం చేస్తున్న విద్యార్థినీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కనిగిరి, ఏప్రిల్‌ 18: పాఠశాలలకు వచ్చే విద్యార్థినీ, విద్యార్థుల్లో వారిలో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీసి, వారి భావి జీవితానికి బంగారు బాటలు వేయాలని ఎంఈవో ప్రసాద్‌రావు అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో కనిగిరి గ్రంథాలయం శాఖ ఆధ్వర్యంలో  ఆదివారం జరిగిన ‘చదవడం మాకిష్టం’ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం ఆధ్వర్యంలో విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నీతి కథలు చెప్పించడం, చదవడం, సాహిత్య కళల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన భరతనాట్యం ఎంతో ఆకర్షణగా నిలిచింది. వారిని ఎంఈఓ, గ్రంధపాలకుడు షేక్‌ అబ్దుల్‌ షరీ్‌ఫలు అభినందించి మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మాల్యాద్రి, గౌతమి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T06:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising