ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపకారవేతన పరీక్షకు నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ

ABN, First Publish Date - 2021-02-26T05:57:38+05:30

జాతీయస్థాయి ఉపకార వే తన పరీక్షలు ఎన్‌ఎంఎంఎస్‌, ఎన్‌టీఎస్‌ఈలను కట్టు దిట్టం గా నిర్వహించాలని డీఈవో వీఎస్‌.సుబ్బారావు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవో సుబ్బారావు 


ఒంగోలువిద్య, ఫిబ్రవరి 25 : జాతీయస్థాయి ఉపకార వే తన పరీక్షలు ఎన్‌ఎంఎంఎస్‌, ఎన్‌టీఎస్‌ఈలను కట్టు దిట్టం గా నిర్వహించాలని డీఈవో వీఎస్‌.సుబ్బారావు ఆదేశించారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఈనెల 28వ తేదీన జరిగే ఎన్‌ఎంఎంఎస్‌, ఎన్‌టీఎస్‌ఈ పరీక్షా కేంద్రాల చీఫ్‌లు, డిపార్టుమెంటు అధికారులతో గురువారం ఒంగోలులోని డీఆ ర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూలులో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఎన్‌ఎంఎం ఎస్‌ పరీక్షకు 3105 మంది, ఎన్‌టీఎస్‌ఈ పరీక్షకు 1409 మ ంది హాజరవుతున్నట్లు తెలిపారు. ఎన్‌ఎన్‌ఎంఎస్‌ పరీక్షకు ఒ ంగోలు డివిజన్‌లో 7, మార్కాపురం, కందుకూరు, డివిజన్లల లో మూడేసి చొప్పున మొత్తం 13 పరీక్షా కేంద్రాలను, ఎన్‌ టీఎస్‌ఈ పరీక్షకు ఒంగోలు నగరంలో 6 ప రీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్‌ఎన్‌ఎంఎస్‌ పరీక్షకు ఉదయం 10 నుం చి 1 గంటవరకు ఒకే సెషన్‌లో జరుగుతుంది. ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష పేపర్‌-1 ఉదయం 9.30 నుంచి 11.30వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు జరుగుతుంది. విద్యా ర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీ ఈవో చెప్పారు.  హాల్‌టిక్కెట్‌ రాని వారు ఒకరోజు ముందు తమ దృష్టికి తీసుకువస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామ ని వెల్లడించారు. సమావేశంలో  సహాయ కమిషనర్‌ కె.శివ కుమార్‌, డీఈసీబీ కార్యదర్శి డి.వెంకారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-26T05:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising