ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సగిలేరు’ అభివృద్ధి.. ప్రతిపాదనలలోనే!

ABN, First Publish Date - 2021-02-27T05:43:39+05:30

వర్షం పడిందంటే గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని చాలా ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతారు.

శ్రీనివాస థియేటర్‌లో రోడ్డులో ఇళ్లలోకి చేరిన నీరు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడని ముంపు సమస్య

వర్షం పడితే భయం భయం 

 గిద్దలూరు పట్టణ ప్రజలకు తప్పని ఇబ్బందులు

గిద్దలూరు, ఫిబ్రవరి 26: వర్షం పడిందంటే గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని చాలా ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతారు.  సగిలేరు నదిలో ని నీరు తమ ఇళ్ళలోకి ఎప్పుడు వస్తుందోనని ఆందోళనకు గురవుతుంటారు. నల్లమల అటవీ ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురిసిన సందర్భాలలో సగిలేరు నదికి వర్షం నీరు చేరుకుంటుంది. గిద్దలూరు పట్టణం గుండా వెళ్ళే సగిలేరునదికి ఇరువైపులా ఆక్రమణలు ఏర్పడడం, పూడికతీత పనులు జరుగక కంపచెట్లతో చెత్తాచెదారంతో మూసుకుపోయింది. దీంతో వర్షం నీ రు ముందుకు వెళ్ళలేక పట్టణంలోకి ప్రవేశిస్తుంది. 

నంద్యాల రోడ్డులో, పోరుమామిళ్ళ రోడ్డులలో బ్రిడ్జిలు ఏర్పాటు చేసినప్పటికీ వీటిపై నుంచి నీరు పారి పట్టణంలోకి ప్రవేశిస్తుంది. గత నాలుగు దశాబ్దాల్లో ఐదు పర్యాయాలు సగిలేరునీరు పట్టణంలోకి ప్రవేశిం చి వందలాది గృహాలలోకి నీరు చేరింది. కోట్లాది రూ పాయలమేర ఆస్తి నష్టం సంభవించింది. పట్టణంలో ని శ్రీనివాస థియేటర్‌ రోడ్డు, కొంగళవీడు రోడ్డు, కుసు మ హరనాథ మందిరం, కాలేజ్‌ రోడ్డు, పాండురంగారెడ్డి నగర్‌, కొప్పువారివీధి, సత్యనారాయణ నగర్‌ తది తర ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. అదృష్టవశాత్తు ప్రతిసారి వర్షం నీరు పగటిపూట ఇళ్ళలోకి రా వడంతో ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం ఒక్కసారి మి నహా ఎప్పుడూ జరుగలేదు.  

ప్రతిపాదనలకే పరిమితం

సగిలేరునది నీరు పట్టణంలోకి రాకుండా ఉండేం దుకు వీలుగా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అ ధికారులు పంపిన ప్రతిపాదనలు ఆయా ప్రభుత్వాలు బుట్టదాఖలు చేస్తున్నాయి. టెండర్‌ దశకు వచ్చిన సందర్భాలలో కూడా సరియైున ప్లాన్‌ లేదంటూ ప్రభుత్వాలు ప్రతిపాదనలను పక్కన పడవేస్తున్నాయి. సగిలేరులో పూర్తిస్థాయిలో పూడికతీత పనులు చేపట్టడం, ఆక్రమణలు తొలగించడం, సగిలేరుకు ఇరువైపులా రాతికట్టకాలు కట్టి సులభంగా నీటిని ముందుకు పంపడం, మూడు నాలుగు ప్రాంతాలలో చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాలు పెంచడం, తదితర పనులకు ప్రతి పాదనలు తయారుచేశారు. తొలుత రూ.2 కోట్లు, ఆ తరువాత రూ.7 కోట్లు, అటుపిమ్మట రూ.12 కోట్లు.. ఇలా మూడు పర్యాయాలు ప్రతిపాదనలు తయారుచేసి పంపారు. అయితే, రకరకాల కారణాలతో నిధులు విడుదలకాక ఒక్క పని కూడా జరుగలేదు. దాంతో ఎడతెగని వర్షాలు పడినప్పుడు సగిలేరు నది నిండి  పట్టణంలోకి నీరు వస్తుందోనని ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సగిలేరు నీటి ముంపు సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-02-27T05:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising