ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేషన్‌ వద్ద కోలాహలం

ABN, First Publish Date - 2021-03-04T06:24:55+05:30

ఒంగోలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం నా మినేషన్ల ఉప సంహరణలు, ఆయా పార్టీల బీ ఫారాలు అందజేసేందుకు చివరి రోజు కావడం తో పలు రాజకీయ పార్టీల శ్రేణులు అధిక సం ఖ్యలో తరలివచ్చాయి. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాము ఇచ్చిన బీఫారాలకు రశీదు ఇవ్వాలని ఆధికారులను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విత్‌డ్రా.. బీ ఫారాలు ఇచ్చేందుకు తరలి వచ్చిన పార్టీల శ్రేణులు 

టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం


ఒంగోలు (కార్పొరేషన్‌) మార్చి 3 : ఒంగోలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం నా మినేషన్ల ఉప సంహరణలు, ఆయా పార్టీల బీ ఫారాలు అందజేసేందుకు చివరి రోజు కావడం తో పలు రాజకీయ పార్టీల శ్రేణులు అధిక సం ఖ్యలో తరలివచ్చాయి. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత బీఫారాలు అందజేసిన అనంతరం తమకు అక్‌నాలడ్జ్‌మెంట్‌ కాపీ ఇవ్వాలని టీడీపీ శ్రేణులు కోరగా, కొందరు రిటర్నింగ్‌ అధికారులు అంగీకరించకపోవడంతో వారి తీరును తప్పు పట్టారు. వైపీసీ నాయకుల నామినేషన్ల ఉపసంహరణలు, బీఫారాలు అంద జేత విషయంలో అధికారులు ఎలాంటి అభ్యం తరాలు తెలియజేయడం లేదని, ఉద్దేశ్యపూర్వకం గా టీడీపీ వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ రోపించారు. కాగా మధ్యాహ్నం 3గంటలకు ఉప సంహరణల గడువు ముగియగా, ఆ తర్వాత కూ డా వైసీపీ శ్రేణులు రిటర్నింగ్‌ అధికారుల వద్ద ఉండటంతోపాటు పలు పత్రాలు అందజేసే ప్ర యత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ శ్రే ణులు అభ్యంతరం తెలపగా, పోలీసులు టీడీపీ అభ్యర్థులను బయటకు వెళ్ళాలని ఆదేశించడంతో వారి మఽధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు కార్పొరేషన్‌ కార్యాలయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల నిబంధనల మేరకు 3గంటల తర్వాత రాజకీయ పార్టీ నాయకులు ఉండకూడదని పోలీసులు గట్టగా హెచ్చరించి వారిని బయటకు పంపారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ కాస్తంత వాగ్వాదాలు, గందరగోళంగా ముగిసింది. మరోవైపు బీ ఫారా లు అందించేందుకు, ఉపసంహరణలకు అధికం గా జనం రావడంతో కార్పొరేషన్‌ కార్యాలయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గేటు లోపలికి వచ్చేవారికి వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వ హించారు. 

Updated Date - 2021-03-04T06:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising