ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యథేచ్ఛగా రోడ్ల మార్జిన్లు ఆక్రమణ

ABN, First Publish Date - 2021-04-17T05:13:05+05:30

కంభం, కందులాపురం ప్రధాన సెంటర్లలో రోడ్లు మార్జిన్లు కొందరికి ఆదాయ వనరుగా మారాయి.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా రోడ్డు మార్జిన్ల ఆక్రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దుకాణాల ఏర్పాటు

 అద్దెలకు ఇస్తున్న అక్రమార్కులు

రోడ్లపైనే వాహనాల నిలిపివేత

ట్రాఫిక్‌కు అంతరాయం

కంభం వాసుల అవస్థలు

పట్టించుకోని అధికారులు

కంభం, ఏప్రిల్‌ 16: కంభం, కందులాపురం ప్రధాన సెంటర్లలో రోడ్లు మార్జిన్లు కొందరికి ఆదాయ వనరుగా మారాయి. య థేచ్ఛగా ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నా రు.  పట్టించుకోవాల్సిన అధికారులు మిన్న కుండిపోతున్నారు. దీంతో అక్రమార్కులు ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైజంక్షన్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకు జరుగుతున్న రో డ్డు విస్తరణలో అక్రమ కట్టడాలను తొలగిం చారు. ఇదేక్రమంలో ఆక్రమణదారులు ప్రభుత్వ కా లేజీ రోడ్డులో ఇరువైపులా రోడ్డు మార్జిన్లను, డ్రైనేజీలను సైతం పూడ్చివేసి అక్రమంగా దుకాణాలు ని ర్మించి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దెలకు ఇస్తున్నారు. దీనిని అడ్డుకోవలసిన అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. 

అత్యంత వెడల్పుగల రోడ్డులో మార్జిన్లను తొలుత కొంతమేర ఆకమిస్తారు. క్రమక్రమంగా శాశ్వత కట్టడాలు నిర్మించి అద్దెలకు ఇస్తుంటారు. రోడ్డు మార్జిన్లలో కాస్త స్థలం కనిపించిందంటే రేకుల షెడ్‌, పందిరో, బంకు ఏర్పాటుచేసి స్థలాన్ని ఆక్రమిస్తారు. ఆప్రాంతంలో ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు ముందుకు వచ్చిన చిరువ్యాపారులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. పలువురు లాడ్జీలు, ఇతర వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకుని ముందున్న పంచాయతీ, ప్రభుత్వ స్థలాలను, డ్రైనేజీ కాలువలను ఆక్రమించి వేల రూపాయలు అద్దెలు వసూలు చేస్తున్నారు. కంభం-మార్కాపురం రహదారికి ఇరువైపులా, ఆర్టీసీ బస్టాండ్‌-మెయిన్‌ బజారుకు వెళ్ళే రోడ్డుకు ఇరువైపులా, చౌక్‌ సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర రోడ్డు మార్జిన్లను, కాలువలను ఆక్రమించుకుని టీస్టాల్స్‌, హోటల్స్‌, పా న్‌ బంకులు వంటివి ఏర్పాటు చేశారు. అద్దెకు ఇచ్చిన విషయం బయటకు చెబితే ఎక్కడ ఖాళీ చేపిస్తారనే భయంతో బయటకు చెప్పడంలేదు. షాపులకు వచ్చే వారు రోడ్డుపైనే వాహనాలను నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. 

కార్యదర్శి వివరణ

ఈ విషయంపై కంభం, కందులాపురం పంచాయతీల కార్యదర్శి బ్రహ్మయ్యను వివరణ కోరగా ఆ క్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన సర్పంచ్‌లతో ఆక్రమణలపై చ ర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రోడ్లకు ఇరు వైపులా ఆక్రమించుకుని పంచాయతీకి ఆదాయం లేకుండా చేస్తున్న ఆక్రమణలను వారంలోగా తొలగిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising