ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-30T04:35:27+05:30

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిలోని వల్లూరమ్మ దేవస్థానం ఎదురు శుక్రవారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు(టంగుటూరు), అక్టోబరు 29 : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిలోని వల్లూరమ్మ దేవస్థానం ఎదురు శుక్రవారం చోటుచేసుకుంది. వల్లూరమ్మ దేవస్థానం ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని అతను వేకువనే మృతి చెందాడని స్థానికులు పోలీసులకు చెప్పారు. మృతుని వయస్సు 40-45 ఏళ్ల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. చుట్టుపక్కల వారు చెప్పిన సమాచారం ప్రకారం మృతుడు బిచ్చగాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, మృతుని వివరాలు తెలిసిన వారు టంగుటూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై నయూబ్‌రసూల్‌ కోరారు.


ఎలుకల మందు తిని చికిత్స పొందుతున్న బాలిక మృతి

సింగరాయకొండ, అక్టోబరు 29 : తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఎలుకల మందు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందింది. ఈ సంఘటన కలికివాయి ఎస్సీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలికివాయి గ్రామానికి చెందిన కరిణి మాధవరావు, మాధవి దంపతులకు ఒక కుమార్తె, కుమరుడు ఉన్నారు. కుమార్తె ఉమామహేశ్వరి సింగరాయకొండలోని జిల్లాపరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. బాలిక తరుచూ ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి తినుబండారాలు కొనడం, అధికంగా దుబారా చేస్తుండడంతో తల్లి మందలించింది. మనస్తానం చెందిన బాలిక 21వ తేదీ రాత్రి ఎలుకల మందును ఐస్‌క్రీమ్‌లో కలిపి తినింది. అదేరోజు తెల్లవారు జామున కుమార్తె ఇబ్బందిపడుతుండడాన్ని గమనించిన తల్లిదండ్రులు విషయం తెలుసుకొని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి 27వ తేదీ ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. బాలిక తండ్రి మాధవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎల్‌.సంపత్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-10-30T04:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising