ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైకా నిధులతో రిజర్వాయర్‌కు మహర్దశ

ABN, First Publish Date - 2021-06-22T06:31:17+05:30

వందేళ్ల చరిత్ర కలిగిన మోపాడు రిజర్వాయర్‌ ఆధునీకరణకు జైకా నిధులు మంజూరు కావడంతో మహర్ధశ పడుతుందని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు.

పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌

పామూరు, జూన్‌ 21: వందేళ్ల చరిత్ర కలిగిన మోపాడు రిజర్వాయర్‌ ఆధునీకరణకు జైకా నిధులు మంజూరు కావడంతో మహర్ధశ పడుతుందని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. మండలంలోని లక్ష్మీనర్సాపురం గ్రామం వద్ద ఉన్న మోపాడు రిజర్వాయర్‌ ప్రధాన కాలువకు సంబంధించి లైనింగ్‌ పనులు చేపట్టేందుకు సోమవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోపాడు రిజర్వాయర్‌ పనులు ఆధునీకరణ కోసం  ఏళ్ల తరబడి ప్రతిపాదించిన ప్రతిపాదనలున్నాయన్నారు. జైకో నిధులతో పనులు చేపట్టి రిజర్వాయర్‌ చివరి ఆయకట్టుదారునికి సైతం నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమం లో వైసీపీ నాయకులు పువ్వాడి రాంబాబు, డాక్టర్‌ కోటపాటి శ్రీనివాసులు,దరిశి రాము, కె.రామిరెడ్డి, స్పేస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కరస్పాండెంట్‌ మద్దిశెట్టి శ్రీధర్‌, హుస్సేన్‌రెడ్డి, రవి, కొండారెడ్డి, జి.మార్కు, సర్పంచ్‌లు చప్పిడి వరలక్ష్మి, దేవరబోయిన సుబ్బయ్య, విజయశేఖర్‌బాబు, వైవీ సాయి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతు మీటర్లు బిగించుకోవాలి

కనిగిరి : ప్రతిరైతు విద్యుత్‌ మీటరు బిగించుకోవాలని ఎమ్మెల్యే బుర్రా మదుసూదన్‌ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి వినియోగదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. మీటర్లు బిగించుకున్నందువల్ల నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కేవీజీ సత్యనారాయణ, ఈఈ భాస్కర్‌రావు, ఆరు మండలాల ఏఈలు, మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌,  మడతల కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, రంగనాయకులరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, రామన తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు రామనబోయిన శ్రీనివాసులు యాదవ్‌, వేల్పుల వెంకటేశ్వర్లు యాదవ్‌, దేవకి రాజీవ్‌, పసుపులేటి దీప, తమ్మినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T06:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising