ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో మరమ్మతులు

ABN, First Publish Date - 2021-10-18T04:49:59+05:30

ఆరునెలల క్రితం ప్రారంభించిన ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో మరమ్మతులు చేపట్టారు.

మరమ్మతులు చేసిన అనంతరం రాకపోకలు సాగిస్తున్న బస్సులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తీరిన ప్రయాణికుల ఇబ్బందులు

ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన పంచాయతీ అధికారులు

ఎర్రగొండపాలెం, అక్టోబరు 17 : ఆరునెలల క్రితం ప్రారంభించిన ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో మరమ్మతులు చేపట్టారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బస్టాండ్‌లో మొదట గ్రావెల్‌తో లెవెల్‌ చేసి ప్రారంభించారు. ఇటీవల కురిస్తున్న వర్షానికి ప్రాంగణంలో వర్షం నీరు నిల్వ ఉండి, బస్సుల రాకపోకల సమయంలో మాగాణి భూమిగా తలపిస్తోంది. ప్రయాణికులు నడిచివెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈనెల 2న చినుకుపడితే చిత్తడే..అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్‌ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. పంచాయతీ అధికారులు గ్రావెల్‌తో గుంతలు పూడ్పించారు. ఆవరణను రోలర్‌తో చదును చేయించారు. మర్మతులు చేయడంతో బస్సుల రాకపోకలతోపాటు ప్రయా ణికులకు  ఇబ్బందులు తొలగిపోయాయి.  

ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు తీసు కున్నామని ఈవోపీఆర్డీ కె.రామసుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి ఆదివారం తెలి పారు. గ్రామ పంచాయతీ నిధులతో మరమ్మతులు పూర్తి చేశామన్నారు. దీంతో బస్సుల రాక పోకలకు, వచ్చివెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి పనులు పంచాయతీ ఆధ్వర్యంలో చేశామన్నారు. ఇకపై మార్కాపురం ఆర్టీసీ డిపో అధికారులు చేయించుకోవాలని కోరారు. 




Updated Date - 2021-10-18T04:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising