ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిమ్స్‌లో నర్సింగ్‌ స్కూలు పున:ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-12T06:32:10+05:30

ఒంగోలులోని రిమ్స్‌కు అనుబంఽధంగా మళ్లీ నర్సింగ్‌ స్కూలు ప్రారంభం కానుంది. అందుకు కేంద్రప్రభుత్వ అధికారులు ఆమోదముద్ర వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం ఉత్తర్వులు 

ఏడాదికి 60 అడ్మిషన్లు 

(ఒంగోలు, ఆంధ్రజ్యోతి)

ఒంగోలులోని రిమ్స్‌కు అనుబంఽధంగా మళ్లీ నర్సింగ్‌ స్కూలు ప్రారంభం కానుంది. అందుకు కేంద్రప్రభుత్వ అధికారులు ఆమోదముద్ర వేశారు.  ఒంగోలులోని రిమ్స్‌కు అనుబంధంగా మెడికల్‌ కాలేజీతోపాటు నర్సింగ్‌ స్కూలు గతంలో నడిచేవి. రెండేళ్ల తర్వాత నర్సింగ్‌ కాలేజీ ప్రారంభమైంది. అనంతరం నర్సింగ్‌ స్కూలు రద్దయి కేవలం కాలేజీ మాత్రమే నడుస్తోంది. తదనుగుణంగా వైద్యారోగ్యానికి సంబంధించి ప్రాథమిక విద్యను అభ్యసించే వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేగాక నర్సింగ్‌ స్కూలు నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని వేరేచోటకు బదిలీ చేయడమో, తొలగించడమో చేశారు. ఇటీవల మంత్రి బాలినేని ఈ విషయమై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర అధికారులకు లేఖలు రాశారు. సరైన స్పందన లేకపోవడంతో సీఎం జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్రప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నర్సింగ్‌ స్కూలు పునఃప్రారంభానికి ఆమోదం లభించింది. ఆ మేరకు ఉత్తర్వులు అందాయని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ శ్రీరాములు, ఆర్‌ఎంవో వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఏడాదికి 60మంది ప్రవేశం పొంది విద్యాబోధన చేస్తారని, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. 




Updated Date - 2021-10-12T06:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising