ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

600 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-12-06T04:30:51+05:30

దొనకొండ మండలంలోని చందవరం గ్రామంలోని నర్మదా రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 600 బస్తాల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రేషన్‌ బియ్యం పట్టుకున్న ఎస్సై ఫణిభూషణ్‌, డీటీ సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందవరం రైస్‌మిల్లుపై పోలీసు, రెవెన్యూ అధికారుల దాడులు

దొనకొండ(చందవరం), డిసెంబరు 5 : మండలంలోని చందవరం గ్రామంలోని నర్మదా రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 600 బస్తాల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై బి.ఫణిభూషణ్‌ తన సిబ్బందితో, డిప్యూటీ తహసీల్దార్‌ పి.సురే్‌షబాబు, వీఆర్వో గాలిరెడ్డి శనివారం అర్ధరాత్రి ఈ మిల్లుపై దాడిచేశారు. రైసు మిల్లులో రేషన్‌ బియ్యం 50 కిలోల బస్తాలు 350, విడిగా మరో 250 బస్తాలను అధికారులు గుర్తించారు. రైస్‌మిల్లు యజమాని ఓబుల్‌రెడ్డిని విచారించగా చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసుకున్నట్లు అంగీకరించారన్నారు. వాటిని పాలిష్‌ చేసి నాణ్యమైన బియ్యంలో కలిపి కృష్ణపట్నం తదితర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయించేందుకు రైస్‌మిల్లులో నిల్వ ఉంచినట్లు తెలిపారన్నారు. ఈగల్‌ బ్రాండ్‌తో వీటిని ప్యాక్‌ చేసినట్లు తెలిపారు. మొత్తం 600 బస్తాలకు చెందిన 30 టన్నుల బియ్యం విలువ రూ.3,90,000 ఉంటుందని అధికారులు నిర్దారించారు.  రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రైస్‌మిల్లును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. యజమాని ఓబుల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫణిభూషణ్‌ చెప్పారు.

Updated Date - 2021-12-06T04:30:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising