ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీజేసీ ప్రిన్సిపాల్‌గా రమణారెడ్డి బాధ్యతలు

ABN, First Publish Date - 2021-10-26T06:58:25+05:30

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పోలంరెడ్డి రమణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ప్రిన్సిపల్‌ను సన్మానిస్తున్న అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, అక్టోబరు 25: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పోలంరెడ్డి రమణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ కళాశాల విద్యార్ది మరియు ఇదే కళాశాల్లో కెమిస్ర్టీ అధ్యాపకునిగా పనిచేస్తూ పదోన్నతిపై నెల్లూరు జిల్లా కొండాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెళ్ళారు. ఇటీవల జరిగిన బదిలీల్లో కనిగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా నేడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రమణారెడ్డి మాట్లాడుతూ చదువుకున్న కళాశాలలోనే అద్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల ప్రతిష్ట మరింత పెంచడానికి, అభివృద్ది చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్‌ను కళాశాల అద్యాపకులు, సిబ్బంది ఆయన్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు షేక్‌ కాశీంపీరా, జె సురే్‌షరెడ్డి, గురవయ్య, పద్మజ, హనుమంతరావు, రవీంద్ర, సురేష్‌, రామరాజు, నాగమణి, కోటి సాహెబ్‌, కె రామ్‌మోహన్‌రావు, ఉమాజయశ్రీ, ఎం సుబ్బరాయుడులు పాల్గోన్నారు. 


Updated Date - 2021-10-26T06:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising