ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాన.. వణుకు!

ABN, First Publish Date - 2021-11-30T06:39:13+05:30

జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రజలను వణికిస్తున్నాయి. కర్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో ఈనెల 12నుంచి 22 వరకూ తెరపిలేకుండా వర్షాలు కురిశాయి. రైతులను కోలుకోని దెబ్బతీశాయి. అనంతరం ఐదారు రోజులు వాతావరణం కాస్తంత తెరపి ఇవ్వడంతో మిగిలిన పంటను దక్కించుకునేందుకు వారు అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి మళ్లీ ముసురు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో జిల్లాలో 19.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. తూర్పు, దక్షిణ ప్రాంతంలోని దాదాపు 20కిపైగా మండలాల్లో ఆదివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

రాళ్లపాడు నుంచి విడుదలవుతున్న వరద నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాను వీడని వర్షం

మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి

పెరుగుతున్న నష్టం అంచనాలు

బాధిత రైతుల కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు

టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077, 08592 281400 కేటాయింపు

రాళ్లపాడుకు పోటెత్తిన వరద

గుండ్లకమ్మకూ భారీగానే నీరు

ఒంగోలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రజలను వణికిస్తున్నాయి. కర్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో ఈనెల 12నుంచి 22 వరకూ తెరపిలేకుండా వర్షాలు కురిశాయి. రైతులను కోలుకోని దెబ్బతీశాయి. అనంతరం ఐదారు రోజులు వాతావరణం కాస్తంత తెరపి ఇవ్వడంతో మిగిలిన పంటను దక్కించుకునేందుకు వారు అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో  ఆదివారం ఉదయం నుంచి మళ్లీ ముసురు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో జిల్లాలో 19.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. తూర్పు, దక్షిణ ప్రాంతంలోని దాదాపు 20కిపైగా మండలాల్లో ఆదివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తిరిగి సోమవారం పగలంతా అదేప్రాంతంలో జల్లులు పడుతూనే ఉన్నాయి. ఒంగోలు, కనిగిరి, కందుకూరు, కొండపి, పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో ఒక మోస్తరు వాన కురిసింది. దాని వల్ల పంటలకు మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు దిగులు చెందుతున్నారు. 

రాళ్లపాడు నాలుగు గేట్ల ఎత్తివేత

వర్షాలతో జిల్లాలో ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు, నదుల్లోకి వరద నీరు అధికంగా చేరుతోంది. నెల్లూరు జిల్లాలో భారీగా కురిసిన వర్షాల ప్రభావం కూడా జిల్లాపై కనిపిస్తోంది. ఆప్రాంత నీరు వచ్చే రాళ్లపాడుకు వరద పోటెత్తుతోంది. రాళ్లపాడు ప్రాజెక్టుకు దాదాపు 23,500 క్యూసెక్కులు వ చ్చి చేరుతుండగా నాలుగు గేట్లు ఎత్తి 31,700 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కూడా 3వేల క్యూసెక్కులు వస్తుండగా ఒక గేటు ఎత్తి అంతమేర దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా రోడ్లు, మరింత దారుణంగా దెబ్బతిన్నాయి. 


Updated Date - 2021-11-30T06:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising