ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్వ చరిత్రను తెలియజేయడం సంతోషం

ABN, First Publish Date - 2021-07-25T06:02:12+05:30

పూర్వచరిత్ర కలిగిన శ్రీ కనక సురభేశ్వర చరి త్రను నేటి తరం వారికి తెలియజేసేందుకు పుస్తకం తేవడం సంతోషమని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు.

శీకనక సురభేశ్వర చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే అన్నా రాంబాబు

గిద్దలూరు టౌన్‌, జూలై 24 : పూర్వచరిత్ర కలిగిన శ్రీ కనక సురభేశ్వర చరి త్రను నేటి తరం వారికి తెలియజేసేందుకు పుస్తకం తేవడం సంతోషమని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. రాచర్ల మండలం జెపిచెరువు గ్రామానికి చెందిన విద్వాన్‌పత్తి ఓబులయ్య రచించిన శ్రీకనక సురభేశ్వర చరిత్ర పుస్తకాలను శనివారం ఎమ్మెల్యే అన్నా రాంబాబు పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకనక సురభేశ్వర స్వామి ఆలయ చరిత్రను ఓబులయ్య చాలా క్లుప్తంగా రచించారని, ఆలయ పూర్వవైభవం, శాసనాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పగడాల శ్రీరంగం, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ మస్తాన్‌వలి, మునాఫ్‌, రిటైర్డ్‌ ఎస్‌ఐ రంగయ్య, వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

స్వచ్ఛ సంకల్పను విజయవంతం చేయాలి 

మార్కాపురం, జూలై 24 : ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాం బాబు అన్నారు. మండలంలోని మిట్టమీదపల్లె ఏపీ మోడల్‌ స్కూల్‌లో డివిజన్‌లోని సర్పంచ్‌లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ముందస్తున్న ప్ర ణాళిక సిద్ధం చేయాలన్నారు. గ్రామాలలో వీధి దీపాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  కార్యక్ర మంలో డీపీవో నారాయణరెడ్డి, ఎంపీడీవో హనుమంతరావు, డీఎల్‌డీవో సాయికు మార్‌, డీఎల్‌పీవో నాగేశ్వరరావు, ఈవోపీఆర్డీ రాంమోహన్‌రెడ్డి  పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising